స్పెయిన్‌లోని వాలెన్సియాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. 72 మంది మరణించారు.. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.. దక్షిణ స్పెయిన్‌లోనూ భారీ వర్షాలు కురిశాయి. వీధులు బురద నీటితో నిండిపోయాయి.. వరదల కారణంగా పలువురు తప్పిపోయినట్లు అధికార ప్రతినిధి పేర్కొన్నారు.. వరదల కారణంగా పలువురు తప్పిపోయినట్లు అధికార ప్రతినిధి పేర్కొన్నారు. తప్పిపోయిన వారి కోసం డ్రోన్ల సహాయంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.. స్పెయిన్ కేంద్రం ఓ సంక్షోభ కమిటీని ఏర్పాటుచేసింది.. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి ప్రజలును అధికారులు హెచ్చరించారు.. రాష్ట్ర వాతావరణ సంస్థ వాలెన్సియా ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.. సిటీ హాల్ అన్ని పాఠశాల తరగతులు. క్రీడా కార్యక్రమాలను నిలిపివేశారు.. 12 విమానాలను దారి మళ్లించగా. 10 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.. రైళ్ల రాకపోకలను సైతం నిలిపివేశారు.. అండలూసియాలో సుమారు 300 మంది ప్రయాణికులతో వస్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.