CM Revanth Reddy and Team Landon Tour : థేమ్స్‌నదిపై అధ్యయనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం లండన్‌లో పర్యటిస్తోంది. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం థేమ్స్ అభివృద్ధిని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. ఈ నది నిర్మాణంలో ఎదురైన సవాళ్లు, ఇంజినీరింగ్, పెట్టుబడి, ఆదాయంపై ఆరా తీస్తున్నారు. పోర్ట్ ఆఫ్ లండన్ బృందం పూర్తి సహకారమందిస్తామని తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని చర్చలకు సిద్ధమని పేర్కొంది.