చిలీలో ఆగని కార్చిచ్చు- 123కు చేరిన మృతులు - Chile Wildfires Death Toll
Chile Wildfires Death Toll : గత మూడు రోజులుగా చిలీని బెంబేలెత్తిస్తున్న కార్చిచ్చు మంటలు ఇంకా చల్లారట్లేదు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెలరేగిన ఈ మంటల ప్రభావంతో ఇప్పటివరకు 123 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో గాయాల పాలయ్యారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటికే వేల హెక్టార్ల అటవీప్రాంతం కాలి బూడిదైంది. ఈ అగ్నికీలలను అదుపు చేసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
లాటిన్ అమెరికా దేశం చిలీని కార్చిచ్చు మంటలు అతలాకుతలం చేస్తున్నాయి.కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు 123 మంది చనిపోయారు. వేల మంది గాయపడ్డారు.వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.వందల సంఖ్యలో పౌరులు నిరాశ్రయులయ్యారు.వందలాది మంది ఆచూకీ లభించడం లేదని పోలీసులు తెలిపారు.వివిధ ప్రాంతాల్లోని అడవుల్లో వేల ఎకరాల్లో ఈ కార్చిచ్చు మంటలు చెలరేగాయి.అగ్నికీలలను నియంత్రించేందుకు సహాయక బృందాలతో కలిసి అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది.మంటల తీవ్రత అధికంగా ఉన్న వినా డెల్ మార్ పట్టణంలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి.పెద్ద ఎత్తున చెలరేగుతున్న మంటలు, దట్టమైన పొగ నేపథ్యంలో చాలా మంది ఇళ్లల్లోనే చిక్కుకుపోయారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వినా డెల్ మార్ పట్టణం ఉన్న వల్పరైజో రీజియన్ గవర్నర్ రోడ్రిగో ఈ కార్చిచ్చులపై అనుమానం వ్యక్తం చేశారు.కావాలనే ఎవరో ఈ పని చేసినట్లుగా ఉందని రోడ్రిగో తెలిపారు.ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో మంటలు చెలరేగడం అనేక అనుమానాలకు తావిస్తోందని గవర్నర్ అన్నారు.ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నిజాలను వెలికితీస్తామని రోడ్రిగో స్పష్టం చేశారు.మరోవైపు, చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ రెండు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు.మంటల్లో కాలిన తన ఇంటిని చూస్తూ విలపిస్తున్న పౌరుడుసహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిసహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికార్చిచ్చు మంటలకు దూరంగా వెళ్తున్న పౌరులుసహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది