తెలంగాణ

telangana

ETV Bharat / photos

ఒక్క వ్యక్తి కారణంగా 3.48 లక్షల ఎకరాల అడవి భస్మం - California Wildfire

California Wildfire : అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి కారణంగా పుట్టుకొచ్చిన కార్చిచ్చు ‘ది పార్క్‌ఫైర్‌' అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. గంటకు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరిస్తూ పరిసరాలను కాల్చి, బూడిద చేస్తోంది. ఇప్పటి వరకు 3.48 లక్షల ఎకరాలను దహనం చేసింది. శనివారం ఒక్క రోజే 1.5 లక్షల ఎకరాలు కాలిపోయినట్లు సమాచారం. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 12:46 PM IST

California Wildfire : కాలిఫోర్నియాను కార్చిచ్చు 'ది పార్క్​ఫైర్' అతలాకుతలం చేస్తోంది. ఈ కార్చిచ్చు వల్ల దాదాపు 3లక్షల ఎకరాల్లో ఉన్న చెట్లు, పొలాలు, వాహనాలు ఆహుతయ్యాయి. (Associated Press)
ఉత్తర కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి కారణంగా పుట్టుకొచ్చిన కార్చిచ్చు ‘ది పార్క్‌ఫైర్‌' అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. (Associated Press)
గంటకు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరిస్తూ పరిసరాలను కాల్చి, బూడిద చేస్తోంది. (Associated Press)
కావాలని అడవికి నిప్పు పెట్టడం వల్ల బుధవారం కార్చిచ్చు మొదలైనట్లు అనుమానాలున్నాయి. (Associated Press)
కాలిపోతున్న కారును దొర్లించడం వల్లే మంటలు మొదలైనట్లు సమాచారం. (Associated Press)
ఈ ఘటనకు సంబంధించి 42 ఏళ్ల రోనీ డీన్‌ స్టౌట్‌ అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. (Associated Press)
ఇప్పటి వరకు ఈశాన్య చికోలో 3.48 లక్షల ఎకరాలను కార్చిచ్చు దహనం చేసింది. (Associated Press)
శనివారం ఒక్క రోజే 1.5లక్షల ఎకరాలు కాలిపోయినట్లు సమాచారం. (Associated Press)
కాలిఫోర్నియాలోని బుట్టె, టెహమ్మా కౌంటీల్లో స్టేట్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ ప్రకటించారు. (Associated Press)
బుధవారం నుంచి 16 హెలికాప్టర్లతో, 2,500 మంది అగ్నిమాపక సిబ్బంది కార్చిచ్చును ఆర్పేందుకు శ్రమిస్తున్నా పురోగతి లేదు. (Associated Press)
ఈ ఏడాది కాలిఫోర్నియా రాష్ట్రం ఎదుర్కొన్న అతిపెద్ద కార్చిచ్చు ఇదే. (Associated Press)
కొన్ని చోట్ల మంటల సుడులు (ఫైర్నిడోలు) ఏర్పడుతున్నాయి. (Associated Press)
ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో భారీగా గడ్డి పెరగడం వల్లే సిబ్బంది ముందుకు వెళ్లలేకపోతున్నారు. (Associated Press)
ప్రస్తుతం వందల సంఖ్యలో కార్చిచ్చులు అమెరికా, కెనడాల్లో వ్యాపించాయి. (Associated Press)
కాలిఫోర్నియాలో కార్చిచ్చు (Associated Press)
కాలిఫోర్నియాలో కార్చిచ్చు (Associated Press)
కాలిఫోర్నియాలో కార్చిచ్చు (Associated Press)
కాలిఫోర్నియాలో కార్చిచ్చు (Associated Press)
కాలిఫోర్నియాలో కార్చిచ్చు (Associated Press)

ABOUT THE AUTHOR

...view details