తెలంగాణ

telangana

ఇంకా అంతరిక్షంలోనే సునీత విలియమ్స్‌ - భూమికి తిరిగొచ్చిన స్టార్‌లైనర్ - Boeing Starliner Return

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 10:46 AM IST

Boeing Starliner Return : బోయింగ్‌ చేపట్టిన తొలి అంతరిక్ష మానవసహిత ప్రయోగం అర్ధంతరంగా ముగిసింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన ఈ సంస్థ వ్యోమనౌకకు పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి ఖాళీ క్యాప్సుల్‌ కిందకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని నెలల పాటు సునీతా, విల్‌మోర్‌ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. (Associated Press)
వ్యోమగాములు లేకుండానే బోయింగ్‌ స్టార్‌లైనర్‌ భూమికి తిరిగొచ్చింది. ఇందులోనే సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. (Associated Press)
బోయింగ్‌ క్రూ ఫ్లైట్‌ టెస్ట్‌లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్‌లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. (Associated Press)
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ ఈ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో జూన్‌ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. (Associated Press)
జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉంది. (Associated Press)
కానీ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తటం, హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. (Associated Press)
దీనిని సరిచేసే క్రమంలోనే వ్యోమగాముల తిరుగుప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది. (Associated Press)
సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్‌, వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్‌ సురక్షితమే అని చెప్పింది. (Associated Press)
కానీ, నాసా అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్‌లైనర్‌ ఖాళీగా తిరుగుపయనమైంది. (Associated Press)

ABOUT THE AUTHOR

...view details