How to Make Crispy Potato Cubes : చాలా మందికి బంగాళదుంపలతో చేసిన వంటకాలు ఫేవరేట్ డిష్‌గా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకైతే వీటితో చేసిన ఏ ఆహారం అయినా ఇట్టే నచ్చుతుంది. అందుకే.. వారికోసం ఆలూతో ప్రిపేర్ చేసుకునే ఒక స్పెషల్ స్నాక్ ఐటమ్ తీసుకొచ్చాం. అదే.. "క్రిస్పీ పొటాటో క్యూబ్స్". ఎప్పుడూ ఆలూతో చిప్స్, బజ్జీలు, వడలు, ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా.. ఈసారి ఇలా క్యూబ్స్ ప్రిపేర్ చేసి పెట్టండి. ఇష్టంగా లాగిస్తారు. పైగా ఈ స్నాక్ రెసిపీ కోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. చాలా ఈజీగా నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ.. క్రిస్పీ పొటాటో క్యూబ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బంగాళ దుంపలు - 4
- నూనె - వేయించడానికి తగినంత
- ఉప్పు - కొద్దిగా
- కాశ్మీరీ చిల్లీ పౌడర్ - 1 టీస్పూన్
- చాట్ మసాలా - అర టీస్పూన్
తయారీ విధానం :
- ముందుగా చాకు లేదా పీలర్ సహాయంతో బంగాళదుంపల పైపొట్టు తీసుకోవాలి. ఆపై వాటిని శుభ్రంగా కడిగి చిన్న సైజ్ క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి.
- తర్వాత ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఆలూ క్యూబ్స్ వేసి మరోసారి వాష్ చేసుకోవాలి. ఇది వాటిల్లో ఉన్న ఎక్స్ట్రా స్టార్చ్ తొలగించడానికి సహాయపడుతుంది.
- ఆపై వాటిని వాటర్ నుంచి వేరుచేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు మరో బౌల్లో వేడి వాటర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలపాలి.
- అనంతరం వాష్ చేసి ప్లేట్లో ఉంచుకున్న ఆలూ ముక్కలను ఉప్పు వాటర్‌లో వేసి 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
- 5 నిమిషాలయ్యాక జల్లీ సహాయంతో ఆలూ ముక్కలను వడకట్టుకొని.. టిష్యూ పేపర్ లేదా క్లాత్‌పై వేసి ఆరబెట్టుకోవాలి. ఇది వాటిల్లో ఉన్న అదనపు వాటర్ పోవడానికి తోడ్పడుతుంది.
- ఇప్పుడు స్టౌపై.. పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక బంగాళదుంప ముక్కలను అందులో వేసుకోవాలి.
- ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి.. మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఆలూ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు ఒక చిన్న బౌల్లో అరటీస్పూన్ ఉప్పు, చాట్ మసాలా, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం.. ఆ మసాలా మిశ్రమాన్ని వేయించుకొని పక్కన పెట్టుకున్న ఆలూ ముక్కలలో వేసుకొని బాగా కలుపుకోవాలి.
- అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "క్రిస్పీ ఆలూ క్యూబ్స్" రెడీ!
- ఇక వీటిని టూత్‌పిక్స్ సహాయంతో టమాటా సాస్‌లో అద్దుకుని తింటే రుచి సూపర్‌గా ఉంటాయి!
ఇవీ చదవండి :
ఆలుగడ్డతో అద్దిరిపోయే వడలు పది నిమిషాల్లోనే! - ఇలా ప్రిపేర్ చేస్తే వహ్వా అంటారు!
క్రిస్పీ పొటాటో లాలీపాప్స్- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!