ETV Bharat / state

ఎరక్కపోయి ఇరుక్కుపోయింది - తేలు చేతిలో పాము ఔట్ - SNAKE VS SCORPION FIGHT VIDEO

Snake Vs Scorpion Fight Video : సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వైరల్ న్యూస్ వస్తుంటాయి. న్యూస్ సంగతి అటుంచితే నెట్టింట వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలంటే నేటి యువతకు భలే ఆసక్తి. కొన్ని వీడియోలు మనసును హత్తుకునేలా ఉంటే మరికొన్ని చాలా ఇంట్రెస్టింగ్​గా అనిపిస్తాయి. అలా ఆసక్తికరంగా ఉన్న ఓ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటో మీరూ ఓసారి చూసేయండి మరి.

Animals Viral Videos
Snake and Scorpion Fight Video (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 10:45 AM IST

Snake Scorpion Viral Video : "జీవితమంటే పోరాటం.. పోరాటంలో ఉంది జయం." ఇది సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రంలో పాట. మనం బతకాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోక తప్పదు. అయితే ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు. జంతువులకు కూడా వర్తిస్తుంది. జంతువులు బతకాలంటే ఆహారం కావాలి. అవి ఆహారం కోసం చేసే ప్రయత్నాలు, పోరాటాలు అన్నీ ఇన్నీ కావు. కొన్నిసార్లు ఆహారాన్ని వెతుకున్నే క్రమంలో, ఇతర జీవులకు ఫుడ్​గా మారిపోతుంటాయి.

అడవిలో బలం ఉన్నోడిదే పైచేయి అనుకుంటాం కానీ, కొన్ని సందర్భాల్లో చిన్న జీవుల చేతిలో పెద్ద జంతువులు కూడా మరణిస్తాయి. ఈ వీడియో చూస్తే అది నిజమేనని అనిపించక మానదు. బతుకు కోసం ఎవరి పోరాటం వారిదే మరి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోను చూసేయండి మరి.

బాగా ఆకలి మీద ఉన్న పాము పొదల్లో ఉన్న తేలును ఒక్కసారిగా ఆరగించబోయింది. కానీ తేలు మాత్రం పాముకు చుక్కలు చూపించింది. పాము మెడను తన కొండిలతో గట్టిగా పట్టుకుని దానికి ఊపిరాడకుండా చేసింది తేలు. తేలు ఉడుంపట్టుకు పాముకు అటు మింగలేక, తేలును వదలలేక గిలగిలలాడిపోయింది. ఈ వీడియోను క్షుణ్నంగా పరిశీలిస్తే చివరకు ఈ పోరాటంలో తేలు చేతిలో పాము ప్రాణాలు విడిచినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పాములో అసలు చలనమే లేదు.

ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎరక్కపోయి ఇరుక్కుపోయిందని, తేలు చేతిలో పాముకు చావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో తేలును పాము చంపుతోందని అంటుంటే, ఇంకొందరేమో తేలు చేతిలోనే పాము చనిపోయిందని నెట్టింట డిబేట్ మొదలు పెట్టారు.

జంతువులకు టైమ్ గురించి తెలుసా? చిన్నచిన్న వాటి పరిస్థితి ఏంటి? - Animals Time Experience

ప్రపంచంలో అత్యంత ప్రమాదకర జీవి 'దోమ'- టాప్​ 10 లిస్ట్​లో ఇంకా ఏమున్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.