Polluting Industries in Hyderabad : రాష్ట్రంలో కాలుష్యకారక పరిశ్రమలపై పీసీబీ ఉక్కపాదం మోపింది. అనుమతుల్లేకుండా, కాలుష్య నియంత్రణ పాటించని సంస్థలపై కొరడా ఝళిపించింది. సదరు సంస్థలకు మార్గదర్శకాలు నిర్దేశిస్తూ బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలని హుకుం జారీచేసింది. పరిశ్రమలకు సమీపంలోని స్థానికుల ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన టాస్క్‌ఫోర్స్ బృందం కన్‌సెంట్ ఫర్ ఆపరేషన్ అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన పనులపై నివేదిక రూపొందించి, సమావేశంలో చర్చించి చర్యలు తీసుకుంది.
రూ.6లక్షలు చెల్లించండి : కన్‌సెంట్ ఫర్ ఆపరేషన్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకుండా విరుద్ధంగా ప్రవర్తించినందుకు గానూ రూ.6లక్షల బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలంటూ ఫరూక్‌నగర్‌లోని సాలసర్ ఐరన్ అండ్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పీసీబీ స్పష్టం చేసింది. పరిశ్రమలో కొలిమి నుంచి విడుదలయ్యే ఉద్గారాలను నియంత్రించాలని, స్లాగ్ క్రషర్‌కి క్లాడింగ్, పల్వరైజర్ల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలని సంస్థ యాజమాన్యానికి తెలిపింది. కంటిన్యుయెస్ ఆన్‌లైన్ స్టాక్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి టీజీపీసీబీ సర్వర్‌కు అనుసంధానించాలని సూచించింది.
నివాసాల మధ్య కాలుష్యం : నిర్మాణ ప్రాజెక్టు వల్ల స్థానికులకు కాలుష్యానికి కారణమైన కూకట్‌పల్లిలోని స్క్వేర్ స్పేస్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు జారీ చేసింది. దుమ్ము రేగకుండా, శబ్దకాలుష్యం లేకుండా చర్యలు చేపట్టాలని సదరు సంస్థను ఆదేశించింది. తవ్వకాలు, బ్లాస్టింగ్, లోడింగ్ తదితరాల్లో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది.
వాయు కాలుష్యానికి చెక్ పెడుతూ ఎంఎస్ షీట్స్, కిర్బీని ప్రాజెక్టు చుట్టుపక్కల ఏర్పాటు చేయాలని సూచించింది. కాలుష్యంపై స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదుతో పీసీబీ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నిర్మాణ ప్రాజెక్టులో తనిఖీలు చేపట్టారు. అప్పటికే 1,09,557.4 చదరపు మీటర్ల స్థలంలో 18 రెసిడెన్షియల్ టవర్ల పనులు చేపట్టగా 9 బ్లాక్‌లలో తవ్వకాల పనులు, 7 బ్లాక్‌లలో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. బ్లాస్టింగ్ పనులతో శబ్దకాలుష్యం తీవ్రంగా ఏర్పడుతోందని తెలిపారు. అలాగే నిర్మాణ ప్రాంతాల నుంచి వస్తున్న దుమ్మతో వాయు కాలుష్యం ఏర్పడుతోందని గుర్తించారు.
వినియోగదారులకు షాక్ - మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు - ELECTRICITY CHARGES REVISE IN TG
పచ్చని పొలాల్లో ఇసుక మేటలు - కర్షకుల కళ్లల్లో కన్నీటి ఊటలు - Sand Dunes in Crop Lands