తెలంగాణ

telangana

ETV Bharat / photos

ఫుల్​ ఫ్రీగా సిరియా ప్రజలు- అందరితో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఎంజాయ్​! - NEW ERA FOR SYRIA AFTER ASSAD FALL

Syria After Assad : సిరియాలో నిరంకుశమైన అసద్‌ పాలన అంతమవడం వల్ల ఆ దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ కొత్త శకానికి నాంది పలికారు. ఇంతవరకు అసద్ అరాచకపు పాలనలో మగ్గిన పౌరులకు రెబల్స్‌ తిరుగుబాటుతో భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి. అసద్‌ పాలన కుప్పకూలి వారం రోజులు అవగా సిరియాలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రహదారులపైకి వచ్చిన ప్రజలు ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

సిరియాలో రెబల్స్‌ దెబ్బకు బషర్‌-అల్‌-అసద్‌ ప్రభుత్వం కుప్పకూలిన వారం తర్వాత అక్కడ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. (Associated Press)
పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సిరియా ప్రజల ముఖాల్లో అసద్‌ పాలనా భయం తొలగి చిరునవ్వులు విరబూశాయి.రహదారులపైకి వచ్చిన పౌరులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. (Associated Press)
ఇన్నాళ్లు నిరంకుశ పాలనలో మగ్గి ఒక్కసారిగా స్వేచ్ఛ రావడం వల్ల ప్రజల్లో భావోద్వేగాలు ఉబికివస్తున్నాయి. (Associated Press)
ఐదు దశాబ్దాల అరాచకపు పాలన అంతమొందిన నేపథ్యంలో అక్కడి ప్రజలకు భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి. (Associated Press)
తిరుగుబాటుదారుల నియంత్రణలో కొద్ది కొద్దిగా అక్కడి పరిస్థితులు చక్కబడుతున్నాయి. ప్రతీకార హత్యలు, మతపరమైన హింస, దోపిడీలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. (Associated Press)
సిరియాలో ఇటీవల జరిగిన యుద్ధం కారణంగా వందల కుటుంబాలు దెబ్బతిన్నాయి. వేలాది మంది ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయారు. మరికొంత మంది కారాగారాల్లో జరుగుతున్న క్రూరత్వం నుంచి బయటపడ్డారు. (Associated Press)
సిరియా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఎక్కడ చూసినా పేదరికం తాండవిస్తోంది. (Associated Press)
విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సిరియాలో ఏర్పడే నూతన ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నాయి. (Associated Press)
వారం క్రితం సాయుధ తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌ సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. (Associated Press)
అసద్ తన కుటుంబంతో సహా సిరియాను వదిలి రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు. (Associated Press)
అసద్‌ సిరియాను వీడిన వెంటనే నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని రెబల్స్ సంబరాలు చేసుకున్నారు. (Associated Press)
సిరియాలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సాధారణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. (Associated Press)

ABOUT THE AUTHOR

...view details