విజయవాడ ధర్నా చౌక్ వద్దకు పోలీసులు సుమారు 20 బస్సులో చేరుకున్నారు.. అంగన్వాడీల దీక్ష శిభిరాల వద్దకు అర్థరాత్రి సమయంలో చోరుల్లో చోరబడి వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.. పోలీసులు ఒక్కసారిగా దీక్ష శిబిరాల వద్దకు చేరుకోవడంతో. ఆందోళనకు గురైన అంగన్వాడీలు పోలీసుల చర్యకు ప్రతిఘటించారు.. అర్థరాత్రి శిభిరాల వద్దకు చేరుకున్న పోలీసులు అంగన్వాడీలను అదుపులోకి తీసుకునేందుకు నానా హంగామా చేశారు.. విద్యుత్ లైట్లను తొలగించి ఉద్రిక్త పరిస్థితుల నడుమ అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.. విశాఖ జిల్లా పెందుర్తిలో అరెస్టు అనంతరం అంగన్వాడీలను పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.. నంద్యాల రైల్వేస్టేషన్లో విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు.. తమ ఆందోళనలో భాగంగా అంగన్వాడీలు రాత్రి సమయంలో ప్రభుత్వానకిి వ్యతిరేకంగా పాటలు పాడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు.. చలో విజయవాడ పేరుతో అంగన్వాడీలు చేపట్టిన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు బయలుదేరారు.. అరెస్టు చేయడంతో తమను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేశారంటూ నంద్యాలలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.. వైఎస్సార్ జిల్లా కడపలో పోలీసులు అంగన్వాడీలను అరెస్టు చేసి రాత్రి వేళ స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.. విజయవాడలో అంగన్వాడీలు నిద్రిస్తున్న సమయంలో దీక్ష శిభిరాల వద్దకు చేరుకున్న తీరిది.. అంగన్వాడీలను విజయనగరం రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకోవడంతో. పోలీస్ స్టేషన్ ఎదుట అంగన్వాడీలు నిరసనకు దిగారు.. విజయవాడలో దీక్ష శిభిరాల వద్ద నిద్రిస్తున్న అంగన్వాడీలు. కడప జిల్లా నుంచి చలో విజయవాడ కార్యక్రమానికి తరలివెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.. బాపట్ల జిల్లాలో పోలీసులు రైల్వే స్టేషనల్లో గస్తి కాసి మరీ అదుపులోకి తీసుకున్నారు.. కర్నూలులో అరెస్టు చేయడంతో పోలీస్ స్టేషన్లోనే తమ నిరసన గళాన్ని అంగన్వాడీలు వినిపించారు.. పార్వతిపురం జిల్లా నుంచి 3 బస్సుల్లో తరలివెళ్తున్న 250 మంది అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అదుపులోకి తీసుకోవడంతో సీతంపేట పోలీస్ స్టేషన్ ఎదుట అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు.