ఇన్నాళ్లు గాజాపై విరుచుకపడిన ఇజ్రాయెల్ గత కొన్నిరోజులుగా లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ లక్ష్యంగా మెరుపు దాడులు చేస్తోంది. దీంతో పాలస్తీనా వాసులకు ఎదురైన పరిస్థితే ఇప్పడు దక్షిణ లెబనాన్ వాసులకు ఎదురువుతోంది.. ఫలితంగా బీరుట్ కిక్కిరిసిపోతోంది. దక్షిణ లెబనాన్ నుంచి వస్తున్నవారికి ఉండటానికి సదుపాయాలు లేకపోవడం వల్ల బ్రిడ్జ్‌ల కింద నివాసముంటున్నారు. వంతెన కింద తమకు ఒక ప్లాస్టిక్ చైర్. అట్టపెట్టే నివాసమని అహ్మద్ కైల్ వాపోయారు.. గాజాలో లక్షలాది ప్రజలు తమ ఇళ్లను వీడాల్సిరాగా ఇప్పుడు లెబనాన్‌లోనూ అదే పరిస్థితి. హెజ్‌బొల్లా స్థావరాలకు సమీపంలో ఉండవద్దని. దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరిస్తుండటం వల్ల దక్షిణ లెబనాన్ వాసులు రాజధాని బీరుట్‌కు పయనమవుతున్నారు.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో అహ్మద్ కైల్ 14 గంటల పాటు ప్రయాణించి లెబనాన్ రాజధాని బీరుట్‌కు చేరుకున్నారు. తన నివాసానికి 50 మీటర్ల దూరంలోనే ఇజ్రాయెల్ క్షిపణి పడిందని చెప్పారు.. దక్షిణ లెబనాన్‌లో క్షిపణుల వర్షం కురుస్తోందని అహ్మద్ కైల్ వెల్లడించారు. భవిష్యత్తును ఆలోచించుకుంటేనే భయమేస్తోందని విలపించారు.. హెజ్‌బొల్లాకు చెందిన రాకెట్ ఫైరింగ్ స్టేషన్‌లనే తాము లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెబుతోంది.. లక్ష మందికిపైగా లెబనాన్‌లో తమ ఇళ్లను వీడగా 26 వేల మంది ఉండేందుకు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేశామని లెబనాన్ విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.. గాయాలపాలైన వారికి చికిత్స అందించేందుకు వైద్యులను. నర్సులను నియమించామని వెల్లడించారు.. శరణార్థులు బీరుట్ శివార్లలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాల్లో కానీ బంధువుల ఇళ్లలో కాని ఉండొచ్చని చెప్పారు.. ఇజ్రాయెల్ వరుసదాడుల నేపథ్యంలో వేలాది మంది దక్షిణ లెబనాన్ వాసులు తమ నివాసాలను వదిలి వెళ్లారని ఐరాస శరణార్థి విభాగం తెలిపింది. ఈ స్థాయిలో ప్రజల వలసలు వెళ్లడం తమను ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొంది.. బీరుట్‌కు చేరుకుంటున్న వారికి ఆహారం. నీరు. బెడ్‌షీట్స్ అందిస్తున్నామని వెల్లడించింది. అటు బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 51కి చేరిందని లెబనాన్ వైద్యారోగ్య శాఖ తెలిపింది.. బ్యాగులతో లెబనాన్ వదిలి వెళ్తున్న ప్రజలు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న లెబనాన్ వాసులు. దిక్కుతోచని స్థితిలో లెబనాన్ వాసులు. బీరుట్ వైపు కిక్కిరిసిన వాహనాలు. ఇజ్రాయెల్ దాడులతో ఇల్లు కోల్పోయి రోడ్డుపై మహిళ. సురక్షిత ప్రాంతాలకు లెబనాన్ ప్రజల పయనం. శరణార్థుల శిబిరం