చిన్నా-పెద్దా అందరూ ఇష్టంగా జరుపుకునే పండగ హోలీ. అయితే ఈరోజున జరిగే వేడుకలను కొన్ని ప్రాంతాల్లో భిన్నంగా జరుపుకుంటారు. ముఖ్యంగా వంటకాల విషయంలో. అనేక రాష్ట్రాల్లో ఈ పర్వదినాన కజ్జికాయలు తింటారు. ఇందులో భాగంగానే యూపీ లఖ్‌నవూలోని ఓ ప్రముఖ స్వీట్ షాప్ యజమాని తన దుకాణంలో 24 క్యారెట్ల బంగారు పూతతో తయారు చేసిన కజ్జికాయలను అమ్మకానికి పెట్టారు.