ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

మన పండుగలు ప్రకృతితో ఎలా ముడిపడి ఉన్నాయి? విజయదశమి వెనుకున్న గాథ ఏమిటీ?

సరదాలే కాదు, సద్భావనలు పెంచుకునే రోజుగా దసరా - వేదకాలం నుంచీ ఉన్న దేవీ రూపంలో ఆరాధన

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

VIJAYADASHAMI_SIGNIFICANCE
VIJAYADASHAMI_SIGNIFICANCE (ETV Bharat)

Prathidwani :దసరా అంటే సరదాల రోజు కాదు. సద్భావనలు పెంచుకునే రోజు. విజయదశమి అమ్మ పండగ. ఆ అమ్మ ఈ సృష్టి సమస్తానికీ తల్లి. అందుకే ఆమెను జగన్మాత అని పిలుస్తారు. దేవీ రూపంలో దైవాన్ని ఆరాధించడం వేదకాలం నుంచీ ఉంది. తెలంగాణలో బతుకమ్మ రూపంలో ఆరాధిస్తారు. అన్ని పండగల్లాగే దసరా కూడా ఐహిక, పారమార్ధిక, ఖగోళ, సామాజిక అంశాలతో ముడిపడింది. అసలు నవరాత్రులు ఎందుకు చేస్తారు? అమ్మవారికి ఒక్కో అవతార రూపంతో అలంకరణ చేయటం వెనుక పరమార్థం ఏంటి? అసలు ఇన్ని రూపాలు ధరించటం ఎందుకు? మన పండుగలు ప్రకృతితో ఎలా ముడిపడి ఉన్నాయి? ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మి, సంస్కృత పండితులు, ప్రముఖ ప్రవచనకర్త తాడేపల్లి పతంజలి పాల్గొన్నారు.

పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసర ఉత్సవాలు - ఇక హంస వాహనంపై ఉత్సవమూర్తులకు పూజలు

విజయదశమి పండుగ వెనుక ఓ గాథ :అపరాజితా దేవి అవతరించిన రోజు విజయదశమి. అపరాజితా దేవి అంటే పరాజయమన్నది ఎరుగని దేవత. త్రిశక్తి స్వరూపమైన ఈ దేవిని పూజిస్తే పరాజయమన్నదే ఉండదు. అమ్మవారు మధు, కైటభులను రాక్షసులను సంహరించి ప్రజలకు సుఖఃశాంతులను అందించినది కూడా ఈ రోజే!

విజయాలకు నాంది విజయదశమి :విజయదశమి సర్వ విజయాలకు నాంది. ఈ రోజు ఏ పనిని ప్రారంభించినా విజయం తధ్యం. విజయదశమి రోజునే శ్రీరాముడు లోకకంటకుడైన రావణ సంహారం చేసాడు. అందుకే ఈ రోజు ప్రజలు శ్రీరాముని విజయానికి సంకేతంగా రావణ దహనం కూడా చేస్తారు.

ప్రజ‌ల్ని హింసించిన జ‌గ‌నాసురుడి దుష్టపాల‌నను జ‌నమే అంత‌మొందించారు:చంద్రబాబు, లోకేశ్

కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం :ఇక మహాభారతానికి వస్తే ధర్మరాజు శకునితో మాయా జూదంలో పరాజయం పాలైన తర్వాత పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సివచ్చింది. అప్పుడు పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువులోకి ప్రవేశించేముందు శమీ చెట్టుపై తమ ఆయుధాలను దాచి ఉంచారు. తిరిగి సంవత్సరం తరువాత పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తిరిగి తీసుకున్నదే ఈ విజయదశమి రోజునే! అందుకే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించారు.

శమీ చెట్టు పూజ :విజయదశమి పండుగ రోజు సాయంత్రం శమీ చెట్టును పూజించి ఆ చెట్టు ఆకులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి. శమీ ఆకులు విజయానికి సంకేతం. అందుకే ఇలా చేయాలి. ఇక బహిరంగంగా జరిగే రావణ దహనాన్ని తిలకిస్తే మంచిది. ఈ రోజు పాలపిట్టను చూడడం కూడా శుభ సంకేతంగా భావిస్తారు.

పండుగలు సంప్రదాయ చిహ్నాలు :పండుగలు మన సంప్రదాయానికి ప్రతీకలు. పండుగ పది గండాలు పోగొడుతుంటారు. అందుకే మనకు ఉన్నంతలో పండుగ చేసుకోవాలి. మన పిల్లలకు మన పండుగల గొప్ప తనాన్ని తెలియజేయాలి. మన సాంప్రదాయ విలువలను మన భావితరాలకు భద్రంగా అందించాలి. మనమందరం కూడా విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకుందాం. ఆ విజయదుర్గ అనుగ్రహంతో సకల విజయాలను పొందుదాం.

పండగల పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత: సీఎం చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details