Pratidhwani on Digital Arrest Frauds : డిజిటల్ అరెస్ట్! కొన్ని రోజులుగా ఈ పేరువింటేనే దడ పుట్టేలా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఉన్నచోట నుంచి కదలనివ్వరు ఊపిరి ఆడనివ్వరు భయపెట్టడం, బెదిరించడమే వారి పెట్టుబడి. పొరపాటున చిక్కారా ఖాతాలు ఖాళీ చేసి గాయబ్ అయిపోతారు. ఇప్పుడు మరీ బరితెగిస్తూ నకిలీ పోలీస్ స్టేషన్లు, ఫేక్ కోర్టులతోనూ బేజారెత్తిస్తున్నారు. కస్టమ్స్‌లో మీ పార్శిళ్లు పట్టుకున్నారనో అయినవాళ్లు తీవ్ర నేరాల్లో ఇరుక్కున్నారనో డ్రగ్స్, ఉగ్రవాద కేసుల్లో విచారిస్తున్నామో ఇలా రోజుకో వేషం, పూటకో మోసంతో నిలువునా ముంచేస్తున్నారు.
ఈ పేరే కొంతకాలంగా ప్రజల్ని భయపెడుతూ ఉండడానికి కారణమేంటి? కొన్నిరోజులుగా వెలుగుచూస్తున్న కేసులేం చెబుతున్నాయి? పూటకో వేషంతో ఏమార్చే సైబర్ నేరగాళ్లకు డిజిటల్ అరెస్టులు కొత్త ఆయుధంగా మారాయా? అసలు ఒక్క వీడియోకాల్‌తో ఇంతపెద్దపెద్ద మోసాలు ఎలా చేయగలుగుతున్నారు? కస్టమ్స్‌లో మీ పార్సిల్ పట్టుకున్నారనో, మీ అబ్బాయిని అరెస్టు చేశాం అనో, మీ ఆధార్, ఫోన్ నంబర్లు వేరేదో క్రైమ్‌లో ఇరుక్కున్నాయనో ఫోన్లు వస్తే ఎలా స్పందించాలి?
Cyber Cases in AP : కొన్ని సందర్భాల్లో అటువైపు నుంచి పోలీసు డ్రెస్‌లో, పోలీస్ స్టేషన్లు, కోర్టుల నుంచే వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కాల్ వస్తే భయపడకుండా ఎలా ఉండగలం? అసలు ఇదంతా ఏంటి? డిజిటల్ అరెస్టుల లోతుల్లోకి వెళ్తున్నప్పుడు భయపెడుతున్న మరో అంశం మ్యూల్ ఖాతాలు. అసలు వ్యక్తికి తెలియకుండా ఖాతాల సృష్టి, లావాదేవీలు ఇవేం చెబుతున్నాయి? నిజమైన పోలీసు దర్యాప్తులు, ఇలాంటి నేరగాళ్ల మోసపూరిత ఉచ్చుల పట్ల తేడా తెలుసుకోవడం ఎలా?
డిజిటల్ అరెస్ట్ అయినా, మరో సైబర్ మోసం అయినా అసలు మన వ్యక్తిగత, ఆర్థిక వివరాలు నేరగాళ్లకు ఎలా చేరుతున్నాయి? ఈ పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవడం ఎలా? చాలామందికి వచ్చే ఒక డౌట్ తమకు మోసపూరిత మెస్సేజ్‌లు వచ్చే ఫోన్ నంబర్లు క్లియర్‌గా కనిపిస్తున్నా, వారికి ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నాం? ఈ కేడీ ముఠాలకు ఇంట్లోనే మహిళలు, విశ్రాంత ఉద్యోగులు మరింత సాఫ్ట్ టార్గెట్‌లుగా మారుతున్నారు. అసలేంటీ డిజిటల్ అరెస్టులు? ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి? ఇదే నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో ప్రముఖ సైబర్ నిపుణులు నలమోతు శ్రీధర్, డిజిటల్ ఫోరెన్సిక్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సభ్యులు ప్రసాద్ పాటిబండ్ల పాల్గొన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం.