Hero Nara Rohit Engagement Grandly Held in Hyderabad : సినీ నటుడు నారా రోహిత్ దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్నాడు. నారా రోహిత్, శిరీష(సిరీ)ల నిశ్చితార్థం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరై రోహిత్, శిరీషను ఆశీర్వదించారు. ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులు, విశాఖ ఎంపీ భరత్ - తేజస్విని దంపతులు, సినీ నటుడు శ్రీవిష్ణు దంపతులు ఈ వేడుకకు హాజరయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై కాబోయే దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. నిశ్చితార్థ కార్యక్రమ ఏర్పాట్లను నారా భువనేశ్వరి స్వయంగా పర్యవేక్షించారు.
'ప్రతినిధి2' హిట్ అయినట్లు తెలియదే- పొలిటికల్ ఎంట్రీ అప్పుడే!: నారా రోహిత్ - Nara Rohit
ఆ హీరోయిన్‌తోనే నిశ్చితార్థం : 2009లో 'బాణం' సినిమాతో నారా రోహిత్ హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 'సోలో' మూవీతో మంచి హిట్ కొట్టిన తర్వాత వరసగా 2018 వరకు పలు సినిమాలు చేశాడు. అందులో సోలో, ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి, బాలకృష్ణుడు, మెంటర్ మదిలో, వీర భోగ వసంత రాయలు వంటి చిత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత సుమారుగా ఆరేళ్ల గ్యాప్ తీసుకుని ఈ సంవత్సరం మళ్లీ 'ప్రతినిధి-2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'ప్రతినిధి-2' సినిమాలో నటించిన హీరోయిన్‌తోనే నారా రోహిత్ ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాలను ఒప్పించుకొని పెళ్లి పీటలెక్కడానికి సిద్ధపడ్డారు.
సీఎం చంద్రబాబు వరుసకి పెదనాన్న : అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా రోహిత్‌కి వరుసకి పెదనాన్న అవుతారు. చంద్రబాబునాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్. పదిహేనేళ్ల కిందట బాణం అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచమయ్యి తనదైన శైలితో ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ప్రతినిధి-2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం సుందరకాండ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో.. వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి : నారా రోహిత్