ETV Bharat / opinion

'కమలాహారిస్ Vs డొనాల్డ్ ట్రంప్' - అగ్రరాజ్యం అధిపతి అయ్యేదెవరో? - US ELECTION 2024

Pratidhwani : ప్రపంచ రాజకీయాల్లో హాట్​ టాపిక్​గా అమెరికా అధ్యక్ష ఎన్నికలు - విశ్లేషకులు ఏమంటున్నారంటే!

us_election_2024
us_election_2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 6, 2024, 2:07 PM IST

Pratidhwani : అమెరికా తమ అధ్యక్ష పీఠంపైకి మహిళకు మొదటిసారి అవకాశం ఇస్తుందా? అది కూడా భారత సంతతి మూలాలన్న ఓ మహిళ ప్రపంచాన్ని శాసించే శ్వేత సౌధానికి అధిపతి అవుతారా? లేదంటే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌ ట్రంప్‌కు రెండవ ఛాన్స్ చిక్కుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం వేగంగా దగ్గర పడుతోంది. సరిగ్గా నెల రోజులే మిగిలింది. ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఎర్లీ పోలింగ్ కూడా ప్రారంభమైంది. లక్షల మంది తమ తీర్పును ఓట్ల రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు. మరి ఈ అమీతుమీ పోరాటంలో కమలాహారిస్ - డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి? అమెరికా అధ్యక్ష ఎన్నికలను శాసించనున్న అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో అంత‌ర్జాతీయ వ్యవహారాల నిపుణులు డా. రాధారఘు రామపాత్రుని, అమెరికా జార్జ్ మాసన్ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్‌ మోహన్ వీ పాల్గొన్నారు.

వాడీవేడీగా అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్చ - ఎవరు పైచేయి సాధించారు? - US ELECTION 2024

ఆసక్తిగా గమనించిన ప్రపంచ దేశాలు : అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకీ హోరాహోరీగా మారుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, ప్రస్తుత అధ్యక్షుడి వారసురాలిగా దూసుకువచ్చిన కమలాహారిస్ మధ్య మాటల తూటాలు, మారుతున్నాయి. ఎన్నికలు జరిగే నవంబర్‌-5 వైపు కాలం వేగంగా కరిగిపోతుండడంతో ఇరుశిబిరాలు ప్రచారాన్ని పీక్స్‌కు చేర్చాయి. ఎన్నికల ఘట్టం చివరిదశలో పై చేయి కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

మాటల యుద్ధానికి కమలా హారిస్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధం- విజయం ఎవరిదో? - Donald Trump vs Kamala Harris

ట్రంప్‌-కమలాహారిస్ మధ్య అధ్యక్ష ఎన్నికల చర్చ : పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో 90 నిమిషాల పాటు జరిగిన అధ్యక్ష అభ్యర్థుల చర్చలో హారిస్ మాటల తూటలకు ట్రంప్ అవాక్కయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలపై వారి వాదనను ఒకరికి ఒకరు వినిపించారు. అబార్షన్ల హక్కుపై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. ఇందుకు కమలా హారిస్ కేంద్ర ప్రభుత్వ గ్వారంటీతో అబార్షన్ హక్కును తీసుకువస్తానని తన వాదనను వినిపించింది. పన్నుల విషయంలో కూడా ఒకరికి ఒకరు వాదనలు వినిపించారు. పన్నులను గణనీయంగా తగ్గించి గతంలో మాదిరి గొప్ప ఆర్థిక వ్యవస్థను తీసుకొస్తానని ట్రంప్ తెలిపాగా, అందుకు కమలా హారిస్ మధ్య తరగతికి పన్నుల నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. వాణిజ్యంలో మిత్ర దేశాల మోసాన్ని అడ్డుకునేందుకు దిగుమతి సుంకాలను పెంచుతానని ట్రంప్ వివరించారు. ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులో తీసుకు వచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని కమలా హారిస్ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ సృష్టం చేయగా, ప్లాస్టిక్ స్ట్రాల నిషేధంపై ముందుకు సాగతానని కమలా హారిస్ తన వాదనను వినిపించింది.

"హోరాహోరీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు - ఎవరు గెలిస్తే ఎవరికి మేలు? " - US PRESIDENTIAL ELECTIONS 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.