Hoardings And Flexes Are Circulating in Some Cities : "సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం", "అసత్య ప్రచారాలకు, దుషణాలకు స్వస్థిపలుకుదాం" అంటూ పలు నగరాల్లో వెలిసిన భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. "చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు" అనే గాంధీజీ సూక్తితో సోషల్ మీడియాపై క్యాంపెయిన్ చేపట్టారు. త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీ చేర్చి "చెడు పోస్టులు వద్దంటూ" ఆసక్తికరంగా హోర్డింగులు ఏర్పాటు చేశారు. "పోస్ట్ నో ఈవిల్" పేరుతో ఫోర్త్ మంకీ బొమ్మతో భారీ హోర్డింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. "మేక్ సోషల్ మీడియా ఏ పాజిటివ్ ఎక్స్ పీరియన్స్" పేరుతో పలు ప్రధాన కూడళ్లలో ఈ హోర్డింగ్స్ వెలిశాయి.
పలు నగరాల్లో ఫ్లెక్లీలు,హోర్డింగ్‌లు : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని, విధ్వేష, విషపూరిత రాతలు వద్దంటూ ఈ విధంగా ప్రచారం చేపట్టారు. "సోషల్ మీడియాను మంచికి, పాజిటివ్ అంశాలకు వేదికగా మార్చుదాం" అనే స్లోగన్‌తో పోస్టులు ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. విజయవాడ- గుంటూరు దారిలో తాడేపల్లి హైవే వద్ద ఈ భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే రాజధాని అమరావతితో పాటు తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లో ఫ్లెక్లీలు,హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.
HC Serious on Twitter: సోషల్ మీడియా కేసు.. ట్విటర్‌పై హైకోర్టు ఆగ్రహం
ఆలోచింపజేస్తున్న క్యాంపెయిన్ : అందరికీ అర్థమయ్యేలా ఆంగ్లం, తెలుగు భాషల్లో వీటిని రూపొందించారు. ఇంట్లో ఉంటున్న ఆడవారిని సైతం వదిలిపెట్టకుండ సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని, వ్యక్తిత్వ హననం చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు చర్చించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం బూతులు, మార్ఫింగ్‌లతో పోస్టులు, అసభ్యకర పోస్టులు పెట్టిన పలువురి నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే సోషల్ మీడియాపై ప్రజలను, నెటిజన్లను చైతన్యపరిచేలా కొందరు ఈ విధంగా క్యాంపెయిన్ చేపట్టాడం అందర్ని ఆలోచింపజేస్తున్నాయి.
'చిక్కడు దొరకడు' - పోలీసులతో ఆర్జీవీ దోబూచులాట
CBI: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసుల్లో సోదాలు ముమ్మరం.. సీబీఐ అదుపులో ఆరుగురు!