ETV Bharat / opinion

చీకట్లు చీల్చుకుంటూ కొత్త ఉషోదయం ముంగిట అమరావతి - కూటమి ప్రభుత్వం రాకతో మారిన పరిస్థితులు - Amaravati Works at Alliance govt - AMARAVATI WORKS AT ALLIANCE GOVT

Prathidhwani on Capital Amaravati Development : ఐదేళ్ల చీకట్లను చీల్చుకుంటూ కొత్త ఉదయాన్నిచూ‌స్తోంది రాజధాని అమరావతి ప్రాంతం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచే అక్కడ పనులు పనులు పున:ప్రారంభయ్యాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ మూడున్నర నెలల వ్యవధిలో అక్కడేం జరిగింది? ప్రపంచస్థాయి నగరాన్నినిర్మించాలన్న సంకల్పానికి ఇకపై జరగాల్సినదేంటి? అంశాలపై నేటి ప్రతిధ్వని.

Prathidhwani on Capital Amaravati Development
Prathidhwani on Capital Amaravati Development (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2024, 3:37 PM IST

Prathidhwani on Capital Amaravati Development : ఐదేళ్ల చీకట్లను చీల్చుకుంటూ కొత్త ఉదయాన్నిచూ‌స్తోంది రాజధాని అమరావతి ప్రాంతం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచే అక్కడ పనులు పనులు పున:ప్రారంభయ్యాయి. నవనగరానికి కొత్త ఆభరణంగా ఔటర్ రింగ్‌ సాధించుకోవడంతోపాటు నిధుల సమస్య తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లోనే హామీ ఇచ్చింది. అన్నమాట ప్రకారం ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 15వేల కోట్ల నిధుల రాకకు కూడా మార్గం సుగమం అయింది.

ఇకపై అమరావతిలో అభివృద్ధి పరుగులు ఎలా ఉండబోతున్నాయి? కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ మూడున్నర నెలల వ్యవధిలో అక్కడేం జరిగింది? ప్రపంచస్థాయి నగరాన్నినిర్మించాలన్న సంకల్పానికి ఇకపై జరగాల్సినదేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొన్న వారు అమరావతి రాజధాని రైతు జేఏసీ నాయకుడు పువ్వాడ సుధాకర్, అమరావతి దళిత బహుజన జేఏసీ వ్యవస్థాపకులు పోతుల బాలకోటయ్య.

వైఎస్సార్సీపీ దెబ్బకు భారంగా మారిన విద్యుత్ ఛార్జీలు - భారం మోపకుండా ఏం చేయాలి? - Pratidhwani on Power Charges in ap

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటిందని తెలిపారు. దీంతో అమరావతి ప్రాంతంలో చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు. ప్రపంచబ్యాంకు 15వేల కోట్ల రూపాయల రుణం ఇస్తామని చెప్పినట్లు గుర్తుచేశారు. అమరావతిలో పనుల వేగవంతానికి ఇది ఎంతో సహాయపడుతుందన్నారు. అమరావతిలో ఇంకా అక్కడక్కడ కొంత భూసేకరణ చేస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వంపై అమరావతి రైతులు చాలా ఆశలు పెట్టుకున్నారని వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వనికి స్పష్టమైన ఆలోచన ఉందన్నారు.

2015 దసరాకు అమరావతి శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. ఈ 9ఏళ్ల కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయని వెల్లడించారు. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో అనేక కుదుపులు చోటుచేసుకున్నాయని వివరించారు. అమరావతి అసలు ముందుకు కదులుతుందా అనే ఆందోళన కూడా ఒకదశలో కలిగిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత పాలన పాఠాల నుంచి కొత్త ప్రభుత్వం చాలా విషయాలు నేర్చుకుందని వెల్లడించారు. రాష్ట్ర రాజధాని అనేది పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా ఉండాలన్నారు. అదే సమయంలో ఇన్వెస్టర్లకు భరోసా ఉండాలని వక్తలు స్పష్టం చేశారు.

దేవదాయశాఖ ప్రక్షాళన - కూటమి సర్కార్‌ ఏం మార్చాలి? - Revamp of Endowments Department

'గుండె చప్పుడు వినండి' - సంతోషం, సంతృప్తి మీ హృదయానికి స్నేహితులని తెలుసా? - World Heart Day 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.