Prathidwani : తనువు, మనస్సు మనల్ని నడిపించే జోడెడ్లు ఈ రెండూ! కానీ రెండింటికీ మనం అదే ప్రాధాన్యం ఇస్తున్నామా అంటే సమాధానం లేదు. అదే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. అదుపు తప్పుతున్న ఆలోచనలు, ఉద్వేగాలు చిత్రవధ చేస్తున్నాయి. మొదట్లో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితాల్నే బలిపీఠంపైకి నెడుతున్నాయి. ప్రతి 100లో 30 మంది, ప్రతి 10మందిలో ముగ్గురు ఏదొక రకంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్‌తో సతమతం అవుతున్నారంటున్నాయి. స్టడీస్, ఉద్యోగాలు, వ్యాపారాల వెంట పరుగులు తీసేవారి జీవితాలు మరింత దయనీయం. కానీ ఎందుకీ దుస్థితి? శారీరక ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ మానసిక ఆరోగ్యంపై ఎందుకు ఉండడం లేదు? ఇకనైనా దిద్దుకోవాల్సిన, సర్దుకోవాల్సిన అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో సైక్రియాట్రిస్ట్‌ల సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు డా. ఎన్ఎన్ రాజు, మానసిక వైద్య నిపుణులు డా. ఇండ్ల విశాల్ పాల్గొన్నారు.
ఒత్తిడితో చిత్తవుతున్నారా - అయితే ఇలా చెక్ పెట్టేయ్ డ్యూడ్
నేటి కాలంలో మానసిక అనారోగ్యం అందరినీ ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు మానసిక ఎదుగుదల లేక ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు పనిలో ఒత్తిడితో పెద్దలు సైతం మానసిక అనారోగ్యానికి లోనవుతున్నారు. వయసు పెరుగుతున్న నేపథ్యంలో మానసిక రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
మరోవైపు పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడి పెరుగుతోందని ఓ సర్వేలో తెేలింది. అందులో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఒత్తిడికి గురవుతున్నారు. వీరిలో నలుగురు వరకు మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు. అందులోనూ ఇప్పుడు భార్య, భర్త ఉద్యోగం చేయడం పరిపాటిగా మారింది. శారీరక శ్రమ పెద్దగా లేకపోయినా మానసికంగా ఉండే ఒత్తిడితో అనారోగ్యానికి చాలామంది లోనవుతున్నారని సైకాలజిస్టులు అంటున్నారు.
ఏడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! నవ్వడమే కాదు కన్నీళ్లు పెట్టడమూ మంచిదే! - Crying Health Benefits
Stress and Anxiety Reasons : అదేవిధంగా ఒత్తిడిని అధిగమించడానికి సహచరులతో మాట్లాడటం, కోపాన్ని తగ్గించుకోవడం, ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆఫీసు విషయాలు ఇళ్లలో ప్రస్తావించకుండా, ఖాళీ సమయాల్లో కుటుంబ సభ్యులతో గడపాలని వారు అంటున్నారు.
ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి మీ కోసం ఈ 'వారం'- మీరు ట్రై చేయండి - Good Habits For A Healthy Week