Pratidwani: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రాష్ట్ర ఖజానాను గుల్ల చేసింది. కనీసం రోడ్లు వేయటానికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఆడంబరాలకు ప్రజా ధనాన్ని తగలేసింది. జగన్ సొంత పత్రిక సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవటం కోసం లక్షలాది కాపీలను ప్రభుత్వ డబ్బుతో వాలంటీర్లకు పంపిణీ చేసింది. జగన్ సర్కార్ రుషికొండను విధ్వంసం చేసి సీఎం ఉండటం కోసం కళ్లు చెదిరే ప్యాలెస్‌ను నిర్మించింది. పరదాలు, బ్యారికేడ్లు కట్టుకుని ప్రజల్లో తిరిగిన మాజీ సీఎం జగన్ 986 మంది సెక్యూరిటీ సిబ్బందిని తన కోసం పెట్టుకోవటం, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ముప్పై అడుగులకు పైగా ఇనుప ఫెన్సింగ్‌లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలు బయటకు వస్తున్నాయి. ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. నేటి ప్రతిధ్వనిలో సీనియర్ జర్నలిస్ట్, కల్లూరి సురేష్ రాజకీయ విశ్లేషకులు, నూర్ మహ్మద్ పాల్గొన్నారు.
సీఎం స్థానంలో ఉండే జగన్ తన సొంత పత్రిక అయిన సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవటం కోసం ప్రజలు పన్నుల రూపేణా చెల్లించిన డబ్బులను వందలకోట్లు దుర్వినియోగం చేయటం అధికార దుర్వినియోగం కాదా? మాజీ సీఎం జగన్ తను ఇంట్లో ఉన్నప్పుడు భద్రత కోసమే 986మందిని నియమించుకున్నారు. ఇదంతా ప్రజల సొమ్ము కాకపోతే ఇంకెవరిది? దేశంలో ఎక్కడైనా ఇలాంటి పోకడ ఉందా.