అభ్యర్థుల చరిత్ర, ఛరిష్మా, పార్టీల మేనిఫెస్టోలు - వీటిలో గెలుపోటములను నిర్ణయించే అంశాలు ఏంటి? - Election Campaign in Telangana 2024 - ELECTION CAMPAIGN IN TELANGANA 2024
Prathidwani on Telangana Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో తుది ఘట్టానికి లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేరింది. పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించాయి. పార్టీ అగ్రనేతలు అందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దాంతో పాటు పలు హామీలు కూడా ఇస్తూ ముందుకు సాగారు. వీటిలో అభ్యర్థుల గెలుపునకు ఏ అంశాలు ఉపయోగపడుతాయో? కొన్నిరోజులుగా ప్రచారం ఎలా సాగిందో తెలుసుకుందాం.
Published : May 11, 2024, 10:20 AM IST
Prathidwani on Telangana Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాయి. అభివృద్ధి కార్యక్రమాల గురించి సంక్షేమ పథకాలపై ఈ పార్టీలు భారీగా హామీలిచ్చాయి. స్థానిక, ప్రాంతీయ, జాతీయ అంశాలపై హోరాహోరీగా ప్రచారాలు చేశాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు ఏఏ అంశాలను ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి? ఏ పార్టీకి ఏఏ అంశాలు ఓట్లు రాలుస్తాయి? తెలంగాణ, లోపలా బయటా రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంది? రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ప్రచార సరళి ఎలా కొనసాగింది? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రచార వ్యూహాలు అమలు చేసింది? ఆ పార్టీ తాను అనుకున్న లక్ష్యాన్ని ఎంత వరకు చేరుకుంటుంది? ఏఏ అంశాలకు ప్రచారంలో ప్రాధాన్యం లభించింది?. బీఆర్ఎస్ ప్రచార వ్యూహాలు ఎలా సాగాయి? ర్యాలీలు, సభల్లో ఆ పార్టీ నేతల ప్రసంగాలు ఇచ్చిన సందేశం ఏంటి? బీఆర్ఎస్ నేతలు గెలుస్తామని అనుకుంటున్న నంబర్‌ను చేరుకుంటుందా?. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఈ పార్టీ ఏఏ అంశాలపై దృష్టి సారించింది? గెలుపుపై బీజేపీ అంచనాలు ఎలా ఉన్నాయి? వాటిని ఎంతవరకు చేరుకుంటుంది? ఈ విషయాలపై నేటి ప్రతిధ్వని.