తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భారత్​పై అమెరికా ఎన్నికల ప్రభావం ఎంత? - Debate On US presidential polls - DEBATE ON US PRESIDENTIAL POLLS

Prathidwani Debate On US Presidential Polls : ఇప్పుడు ప్రపంచంలోని అందరి దృష్టీ అమెరికా ఎన్నికలపై పడింది. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షపీఠాన్ని దక్కించుకునేది ఎవరు? అనేది ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. రిపబ్లికన్​, డెమోక్రాటిక్​ పార్టీల్లో ఎవరు గెలిస్తే ఎవరికి ఏంటనే లెక్కలు కూడా ఆసక్తి కరంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికల్లో ఇండో- అమెరికన్ల పాత్ర, ప్రభావం? ఎవరు గెలిస్తే భారత్​కు ఏం ప్రభావం ఉంటుంది అనే అంశంపై నేటి ప్రతిధ్వని.

Prathidwani Debate On US Presidential Polls
Prathidwani Debate On US Presidential Polls (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 10:33 AM IST

Prathidwani Debate On US Presidential Polls :ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి అమెరికా ఎన్నికలు. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల్లో ఎవరు గెలిస్తే ఎవరికి ఏంటనే లెక్కలు ఆసక్తికరంగా మారాయి. తాజా అంచనాల ప్రకారం రిపబ్లికన్‌ వైపు నుంచి టెంపరి ట్రంప్ డెమోక్రట్ల నుంచి కమలా హారీస్‌ తలపడుతున్నట్టు కనిపిస్తోంది. ట్రంప్‌ను ఢీకొనే సత్తా భారత సంతతి సక్సెస్‌ఫుల్, పవర్‌ఫుల్‌ లీడర్, ఉపాధ్యక్షురాలు కమలాహారీస్‌కే ఉందని డెమెక్రట్లంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల అప్రూవల్ రేటింగ్ అంటే ఏమిటి? ట్రంప్ మాత్రం ఆమె బైడెన్ కంటే దారుణం అంటూ పంచ్‌లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పాత్ర, ప్రభావం ఏ విధంగా ఉండనుంది? ఎవరు గెలిస్తే భారత్‌కు ఏం ప్రభావం ఉంటుంది? ఇదీ నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details