Prathidwani Debate on Coastal Andhra Voters: ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణక్షేత్రంలో కోస్తాంధ్ర కీలకం. అక్కడ రాజకీయ చైతన్యమే కాదు, సీట్ల సంఖ్య కూడా ఎక్కువే. నెంబర్ గేమ్‌గా పేరొందిన ఎన్నికల్లో పైచేయి సాధించాలంటే అత్యధిక స్థానాలున్న కోస్తాంధ్రలో ఎక్కువ సీట్లు సాధించాలి. ఈసారి కోస్తాంధ్రలో పబ్లిక్ పల్స్ ఎలా ఉంది? ఐదేళ్ల కిందట వైసీపీకి పట్టం గట్టిన ఓటరు, ఈసారి ఏం చేయబోతున్నాడు? ఏ జిల్లాలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి? ఇదే నేటి ప్రతిధ్వని కార్యక్రమం. ఈ కార్యక్రమంలోని చర్చలో రాజకీయ విశ్లేషకులు ఎస్పీ సాహెబ్, దాసరి రాజా పాల్గొన్నారు. వారు ఏం చెప్పారో తెలుసుకుందాం.
గత ఎన్నికల్లో కోస్తాంధ్రను వైసీపీ కమ్మేసింది. ఐదేళ్ల తర్వాత ఏ పరిస్థితుల్లో భిన్నంగా ఉన్నాయి. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ అయిపోయాయని రాజకీయ విశ్లేషకుడు సాహెబ్ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వ్యాపారాలు పెట్టుకోవడం వలన, ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. అదే విధంగా ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. చాలా మంది ఎమ్మెల్యేలు రైస్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తాగు నీటి సమస్య సైతం తీవ్రంగా ఉందని తెలిపారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారని అన్నారు. కోస్తాంధ్రలో ఉన్న నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.
కూటమి చేతిలో జగన్ ఓటమి ఖాయమా?- అందుకే ప్రలోభాల పర్వం ప్రారంభించారా?