Prathidwani: కులాభిమానం వేరు. కుల విద్వేషం వేరు. ప్రతి వారికీ తమ కులం అంటే అభిమానం ఉండటం తప్పు కాదు. కానీ ఇతర కులాలను ద్వేషించటం, తమ రాజకీయ స్వార్థం కోసం కులం పేరుతో ప్రజలన విభజించిటం ముమ్మాటికీ తప్పే. 2019లో ఆంధ్రులను ఇలా రెచ్చగొట్టి, ఇటువంటి చీలికలే తీసుకుని వచ్చి జగన్ సీఎం అయ్యారు. ఎన్నికల్లో కేవలం కులం మాత్రమే చూసి ఓటేస్తే మన భవిష్యత్తే నాశనం అవుతుంది. మనం కూర్చున్న కొమ్మను మనమే నరక్కున్నట్టు అవుతుంది.
ఈరోజు ఏపీ అథోగతిపాలు అవటానికి కుల విద్వేషాలు కూడా ఒక కారణం. ఏపీ బాగుపడలన్నా, పూర్వవైభవం రావాలన్నా ప్రజలు అభివృద్ధికే ఓటేయాలి. అలాకాకుండా మా కులపు వాడనో, మా మతం వాడనో ఓటేస్తే ఏం జరుగుతుంది? ఇదీ నేటి ప్రతిధ్వని. నేటి చర్చా కార్యక్రమంలో దళిత బహుజన ఉద్యమ నేత బాల కోటయ్య, ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక నుంచి టి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఇతర రాష్ట్రాలకు వలస పోతున్న ఐటీ యువత - ఏన్డీఏ కూటమికి ఓటు వేసేందుకు ఆసక్తి? - ETV Bharat Prathidwani
కులం కంటే రాష్ట్ర భవిష్యత్ ప్రధానం: ఏపీ విడిపోయి పదేళ్లు అయింది. నేటికీ రాజధాని కూడా కట్టుకోలేదు. కులతత్వం ఏపీకి శాపంగా మారింది. కులాభిమానం వేరు, కులపిచ్చి వేరు. కులపిచ్చి రాష్ట్రాన్ని చాలా నాశనం చేసింది. ఇప్పటికే ఏపీ ఎంతగానో నష్టపోయింది. కాబట్టి ఎన్నికల్లో అభ్యర్థి గుణగుణాలను చూసి ప్రజలంతా ఓటేయాలి. మన కులం వాడేనని తప్పుచేసినా సమర్థించటం ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది. సమర్థత చూసి ఓటేయాలి. కులం కంటే రాష్ట్ర భవిష్యత్ ప్రధానం కావాలి.
కులాల పేరుతో విడగొట్టేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. కులాల పేరుతో ఓటర్లను చీల్చే ఎత్తుగడలను తిప్పికొట్టాలి. అన్ని కులాల వారు అభివృద్ధికి ఓటేయాలి. కులం, మతం, ప్రాంతం ఇవన్నీ ప్రగతికి స్పీడ్‌బ్రేకర్లు కాకూడదు. ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో, ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రం బాగుపడుతుందో, ఎవరు వచ్చాక రాష్ట్రం నాశనమైందో ప్రజలంతా గమనించాలి. ఇలాంటి అంశాలను ప్రజలు లోతుగా ఆలోచించాలి.
జగన్ ఐదేళ్ల పాలన - పేదలకు శాపం - ETV Bharat Prathidwani
కులాల ఐక్యత ఎందుకు అవసరం?: రాష్ట్ర విభజనలో నష్టపోయిన ఏపీని తిరిగి నిలబెట్టాలనే లక్ష్యంతో 2014 ఎన్నికలు జరిగాయి. 2014 నుంచి 2019 వరకు ఏపీ పునర్వైభవం కోసం ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? 2019 ఎన్నికలకు ముందు కులాల చిచ్చుని ఎలా పెట్టారు? దాని ప్రభావం రాష్ట్రంపై ఎలా పడింది? ఏపీ రాజకీయాల్లో కులాన్ని ప్రయోగించి ప్రజలను విభజించటానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అభివృద్ధిని అది ఎలా దెబ్బతీస్తుంది? కులాల ఐక్యత ఎందుకు అవసరం? ఏపీలో కులాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సీఎం జగన్ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటూ ప్రజలను కులాల వారీగా విభజించి పలకరిస్తారు. ఇతర వర్గాల వారు తన వారు కారా? వారు రాష్ట్ర ప్రజలు కాదా? కులతత్వం, కులవిద్వేషం అనేది సమాజానికి ఎటువంటి నష్టాన్ని కలిగిస్తుంది?
వైసీపీ ముద్రగడ, హరిరామజోగయ్య వంటి వారిని అడ్డం పెట్టుకుని మరోసారి ఎలాంటి కుల రాజకీయాలకు ప్రయత్నిస్తోంది? రాబోయే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు వేసే ముందు ఏఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి? ఎటువంటి వారికి ఓటు వేయాలి? రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయింది. రాష్ట్ర తక్షణావసరాలు ఏంటి? కులాల రాష్ట్ర ప్రజలను విభజించటానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు ఏం కావాలి? ఎలాంటి వారు రావాలి? ఓటు ఎలాంటి వారికి వేయాలి? అనేది నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.
ఐదేళ్లలో మహిళలకు జగన్ ఏం చేశారు? - ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చారా! - ETV Bharat Prathidwani