ETV Bharat / opinion

ఏళ్లు గడుస్తున్నా - వ్యవసాయోత్పత్తుల ధరలపై సరైన నియంత్రణ ఎక్కడ? - ESSENTIAL COMMODITIES PRICES IN AP

ఓ రోజు కొండెక్కే కూరగాయల ధరలు - మరో రోజు పంటను పారబోసే రైతులు - దుర్భరంగా పేద, మధ్యతరగతి జీవితాలు

Essential Commodities Prices in AP
Essential Commodities Prices in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2025, 11:28 AM IST

Pratidhwani on Middlemen Ruling Price Hike : జనాలు కొనాలంటే కొరివి. రైతులు అమ్మాలంటే అడవి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు సరిగ్గా సరిపోతుందీ మాట. ప్రతి సంవత్సరం ప్రతి సీజన్‌లో ఇదే దుస్థితి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వివిధ కూరగాయలు మొదలు కందిపప్పు, మినపప్పు, బియ్యం వరకు ఇదే దుస్థితి. ఒక్కోసారి కిలో రూ.200లు పలికిన అదే టమాటాకు కిలో రూ.2 కూడా దక్కక రోడ్లపై పారబోయాల్సిన పరిస్థితుల ఎందుకు? ఇక్కడ కనిపిస్తున్న కారణాలు ఒకటి దళారీ వ్యవస్థ. రెండు ప్రభుత్వ వ్యవస్థాగత వైఫల్యాలు, గోదాముల కొరత.

ఏళ్లు గడుస్తున్నా రైతులు, ప్రజల కష్టం కళ్లకు కడుతున్నా వీటిల్లో ఎందుకు మార్పు రావడం లేదు? వ్యవసాయోత్పత్తుల ధరలపై సరైన నియంత్రణ ఎక్కడ? ఎలాగో పెట్టుబడి సమకూర్చుకుని అనేకవిధాల శ్రమకోర్చి కూరగాయలను సాగుచేస్తున్న అన్నదాతలకు దక్కుతున్నదేంటి? కూరగాయలు, పండ్లకోసం జనం ధారపోస్తున్న డబ్బులో మూడో వంతు మాత్రమే కర్షకుల వరకు చేరుతున్న పరిస్థితి ఉంది. మిగిలిన సొమ్మంతా ట్రేడర్లు, హోల్‌సేలర్లు, రీటైలర్ల వాటాలుగా ఉన్నాయి. అవి కూడా ఛార్జీలకే చెల్లిపోతున్నట్లు ఆర్‌బీఐ నిపుణుల నివేదికలో వెల్లడైంది.

మరి ప్రజలకు అవసరమయ్యే చాలా వ్యవసాయ ఉత్పత్తుల్ని కనీస మద్దతు ధరల జాబితాలో పెట్టిన ప్రభుత్వాలు కూరగాయలు, పండ్లు వంటి వాటిని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రతిప్రాంతంలో అవసరాలకు తగిన స్థాయిలో కూరగాయలు అందుబాటు ధరల్లో లభించాలి అన్నా అదే రీతిలో రైతులకు గిట్టుబాటు కావాలన్నా ఏం చేయాలి? వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ, గిట్టుబాటు ధరలు కల్పించడంలో గోదాముల పాత్ర ఏమిటి? ఈ విషయంలో రాష్ట్రంలో జిల్లాల వారీగా పరిస్థితులు ఎలా ఉన్నాయి?

Essential Commodities Prices in AP : పంటల సరళి తీసుకుంటే రాష్ట్రంలోనే జిల్లాకో దానికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ విషయంలో నిల్వ, పంపిణీ, ప్రణాళికలు ఎలా ఉండాలి? ఈ సమస్యలకు పరిష్కారంగా అందరు చెప్పే మాట పంట వైవిధ్యం. కానీ ఆ దిశగా ప్రభుత్వాల ప్రోత్సాహం, ధరలు, కొనుగోళ్లు ఇదంతా ఎవరు చూడాలి? ఎలా చేయాలి? మొత్తంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెట్ ప్రణాళికలు ఎలా ఉంటే వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో అటు రైతులు, ఇటు ప్రజలు ఇద్దరికీ మేలు జరుగుతుంది? దళారీ వ్యవస్థ కట్టడి ఎలా?

రైతులు, ప్రజల ప్రయోజనాలు కాపాడాలంటే ఏం చేయాలి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ఇకనైనా ఏం చేస్తే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో ప్రజాపంపిణీ వ్యవహారాల నిపుణులు పి. జమలయ్య , బీకేఎస్ అఖిలభారత నాయకులు జే. కుమారస్వామి. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం.

సబ్సిడీ ధరల్లో నిత్యావసర సరకులు- రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు - Essential Commodities Distribution

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.