prathidwani :సవాళ్లున్న చోటే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు సవాళ్లు అనుకున్నవే అవకాశాలుగా కలసి వస్తాయి. కావాల్సిందల్లా సరైన కోణంలో అర్థం చేసుకోవడం, సానుకూలతల్ని ఒడిసి పట్టుకునే సామర్థ్యం కలిగిన నాయకత్వం. 62% పైగా జనాభా వ్యవసాయంపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశాల ఖనిగా ఊరిస్తోన్న ఆహారశుద్ధి రంగం రాష్ట్రప్రభుత్వం ప్రణాళికల గురించే ఈ పరిచయం అంతా.
3 లక్షల మందికి ఉద్యోగాలు :చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు వైవిధ్యమైన పంటలు, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తరతరాలుగా ఉన్న వారసత్వమే మనం బలం. తగినట్లే రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల మందికి ఉద్యోగాల లక్ష్యంతో ఆహారశుద్ధి రంగం విధానం ప్రకటించారు సీఎం చంద్రబాబు. మరి నూతన విధానంపై ఆ రంగం పారిశ్రామికవేత్తలు ఏం అనుకుంటున్నారు? ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు పి. భాస్కరరావు, వర్ష ఆహార శుద్ధి పరిశ్రమ యజమాని విశ్వనాథ నాయుడు పాల్గొన్నారు.
ఆరు విధానాలు నవ్యాంధ్ర లక్ష్యాలు - బ్రాండ్ ఏపీకి గ్రాండ్ బాటలు
ఆరు విధానాలు నవ్యాంధ్ర లక్ష్యాలు :ప్రతిచేతికి పని కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకటే రోజు 6 కీలక విధానాలు ప్రకటించి ఆశ్చర్య పరిచింది. అయిదేళ్లుగా పడావుబడ్డ పారిశ్రామికరంగానికి కొత్త ఊపిరి ఇవ్వడం , అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పారిశ్రామికాభివృద్ధి, ఎంఎస్ఎంఈలు, ఆహారశుద్ధి, ఎలక్ట్రానిక్స్, ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్క్‌లు, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీలు విధానాలు గేమ్ ఛేంజర్లు కానున్నాయి.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం - విద్య, ఉపాధి కల్పనపై లోకేశ్ ప్రత్యేక దృష్టి
బ్రాండ్ ఏపీకి గ్రాండ్ బాటలు :ఆహారశుద్ధి పరిశ్రమలు దీర్ఘకాలంగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుమతుల దగ్గర నుంచి, విద్యుత్ ఛార్జీలు,, ప్రోత్సాహకాలు, రాయితీలు వాటి విషయంలో రాయితీలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వ విధానం, పథకాలకు తోడుగా ఆహారశుద్ధి రంగంలోని వారు కేంద్రప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందించాలి. కూటమి ప్రభుత్వం ఆహార శుద్ధి పరిశ్రమలతో పాటు భారీ, మెగా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, సహకార సంఘాలు, సమాఖ్యలు, స్వయం సహాయ సంఘాలకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఔత్సాహికులకు ఇది ఎలాంటి అవకాశాలు, భరోసా కల్పిస్తుంది.
ఏపీ పెట్టుబడుల స్వర్గధామం - పెట్టుబడిదారులకు వాట్సప్‌లో అప్డేట్స్ : లోకేశ్