ETV Bharat / opinion

ఇజ్రాయెల్ వర్సెస్‌ హమాస్ ​- ఇక్కడితో కథ సుఖాంతం అయ్యేనా! - CEASEFIRE IN ISRAEL

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధంలో కీలక పరిణామం - ఏడాది 3 నెలలుగా జరుగుతున్న భీకర పోరాటంలో శిథిలాల దిబ్బగా మారిన గాజాలో ఎట్టకేలకు శాంతిసంకేతాలు!

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2025, 2:45 PM IST

Pratidhwani : రావణకాష్టంలా రగులుతున్న ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏడాది 3 నెలలుగా జరుగుతున్న భీకర పోరాటంలో శిథిలాల దిబ్బగా మారిన గాజాలో ఎట్టకేలకు శాంతి వీచికలు కనిపిస్తున్నాయి. అంతుదరి లేని ప్రాణనష్టం, ఆస్తినష్టం తగ్గించడం, లక్షలాది మంది జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా ఎట్టకేలకు కాల్పుల విరమణ వైపు అడుగులు పడ్డాయి.

మరి గడిచిన 15 నెలలుగా అక్కడ ఏం జరిగింది? ఇంతకాలం తగ్గేదే లే అంటూ వచ్చిన ఇజ్రాయెల్‌- హమాస్‌ను శాంతి దిశగా నడిపించిన కారణాలు ఏమిటి? ఈ విషయంలో అమెరికా ఏం చేసింది? ఇక్కడితో కథ సుఖాంతం అవుతుందా? బందీల విడుదల, యుద్ధానికి ముగింపు, ప్రాంతీయ స్థిరత్వాల విషయంలో ఇకపై ఏం జరగనుందిో ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఆస్కి నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, ఇండియా ఫారిన్ రిలేషన్స్ సెంటర్ డైరెక్టర్​ డా. కన్నెగంటి రమేష్‌, మరొకరు సెంటర్‌ఫర్ సౌత్ఈస్ట్ ఏసియా&పసిఫిక్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ప్రొ. జయచంద్రారెడ్డి, తిరుపతి ఎస్వీయూ.

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రాధాన్యత ఏమిటి? 2023 అక్టోబర్‌ 7న ప్రారంభమైన ఇజ్రాయేల్ - హమాస్ యుద్ధంలో 15 నెలలుగా ఏం జరిగింది? ఇరుపక్షాలు ప్రస్తుత ఒప్పందానికి ఎందుకు అంగీకరించాయి? గడిచిన ఏడాది 3 నెలల్లో ఎన్నోసార్లు ప్రస్తావనకు వచ్చినా కుదరని శాంతి ఒప్పందం ఇప్పుడే కుదరడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇజ్రాయేల్ - హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్ని 3 దశ ల్లో అమలు చేస్తామని అంటున్నారు. ఈ దశల్లో ఏం జరగాల్సి ఉంది?

శత్రువులకు దొరికితే సొంతవాళ్లే చంపేస్తారు! ఉత్తర కొరియా సైనికులకు క్షణక్షణం భయం భయం!

అటు ఇజ్రాయెల్​ ఇటు పాలస్తీనియన్ల జీవితాలు సాధారణ పరిస్థితులకు రావడానికి ప్రస్తుత ఒప్పందం ఎలాంటి ప్రభావం చూపుతుంది? యుద్ధంతో జరిగిన నష్టం పూడ్చడం సాధ్యమేనా? ఈ మొత్తం పరిణామాల్లో అగ్రరాజ్యం అమెరికా పాత్ర ఏమిటి? అలానే అమెరికా అధ్యక్ష పీఠం నుంచి దిగిపోతున్న బైడెన్, కొత్తగా వస్తున్న ట్రంప్‌ల్లో ఎవరి వల్ల ఇది సాధ్యమైంది? ఇదే సమయంలో అందరిలో మెదులుతున్న ప్రశ్న ఇజ్రాయేల్ - హమాస్ మధ్య ఒప్పందం సరే రష్యా - ఉక్రెయిన్ పోరు మాటేమిటని.

అందుకు ఏమైనా అవకాశాలున్నాయా? మొత్తంగా చూస్తే ఇజ్రాయెల్ - హమాస్ మధ్య ప్రస్తుత ఒప్పందం స్థిరమైన శాంతికి దారితీస్తుందా? ఒకవేళ ఈ ఒప్పందం గనక విఫలమైతే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలపై పూర్తి సమాచారం ఈ ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.

ఉక్రెయిన్‌కు అమెరికా రూ.4,293 కోట్ల సైనిక సహాయం - ఆయుధాలు, క్షిపణులు కూడా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.