Valentines Day 2025 Wishes Telugu : మరికొన్ని గంటల్లో ప్రేమికుల రోజు వచ్చేస్తోంది. ఎన్నో మధురానుభూతులను పంచబోతోంది. ప్రేమికులకు మరింత ప్రియమైన క్షణాలను అందించబోతోంది. మరి, ఈ హ్యాపీ మూమెంట్లో మీ ప్రాణసమానమైన ప్రియుడికి, ప్రేయసికి సరికొత్తగా మీ ప్రేమను తెలియజేయండి. మీ ప్రేమ లోతు ఎంతో చూచాయగానైనా తెలుసుకునే అవకాశం మీ పార్ట్నర్కు ఇవ్వండి. ఇందుకోసం "ఈటీవీ భారత్" స్పెషల్ విషెస్ అందిస్తోంది. లేట్ చేయకుండా ఓ లుక్కేయండి. మీకు నచ్చింది పిక్ చేసుకొని, మీ భాగస్వామికి పంపించండి.
కనులు తెరిస్తే జననం, కనులు మూస్తే మరణం. ఇంత చిన్న జీవితంలో కడవరకూ నీతోనే ఉండాలని నా మనసు ఆరాటపడుతోంది. అవకాశం ఇస్తావా ప్లీజ్
- ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు
నువ్వు కలలు కంటూ ఉండు, నేను వాటిని నెరవేరుస్తూ ఉంటాను. నీ ఆనందాన్ని చూస్తూ నేను సంతోషపడుతూ ఉంటాను. ఈ జీవితానికి ఇది చాలు బంగారం!
- ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
నీ చేయి పట్టుకునేందుకు, నీ పెదాలపై నవ్వు చూసేందుకు కొన్ని వేలసార్లు మరణించైనా సరే, ఒక్కసారి జన్మించడానికి నేను సిద్ధం
- హ్యాపీ వాలెంటైన్స్ డే
మనసారా నవ్వినా, ఏడ్చినా వచ్చేది కన్నీళ్లే. నా తోడుంటే నీ కంట ఆనంద భాష్పాలు మాత్రమే రాలుతాయి. వాగ్ధానం చేస్తున్నాను డియర్
- ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
ఆస్తులు, అంతస్తులు సుఖాన్ని మాత్రమే ఇవ్వగలవు. నీ ప్రేమ మాత్రమే నా పెదాలపై నవ్వులు పూయించగలదు. నీ కోసం దేన్నైనా కోల్పోవడానికి సిద్ధం