ETV Bharat / offbeat

ఫిబ్రవరి 14 కోసం బెస్ట్​ ప్లేస్​ వెతుకుతున్నారా? - హైదరాబాద్​లో అద్దిరిపోయే 9 ప్రదేశాలు! - PLACES FOR COUPLES IN HYDERABAD

-భాగ్యనగరంలో ప్రేమికుల కోసం ప్రశాంతమైన ప్రాంతాలు -ఆ జ్ఞాపకాలు మీ మనుసులో అలా ముద్రించుకుపోతాయి!

Best Places for Couples in Hyderabad
Best Places for Couples in Hyderabad (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2025, 2:11 PM IST

Best Places for Couples in Hyderabad: ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి, వెలకట్టలేని సంపద. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ బంధమూలేని తొలి సంబంధమే ప్రేమ. నిజంగా మనసుపెట్టి చూడగలిగితే, మనస్పూర్తిగా ఆస్వాదించగలిగితే ప్రేమ ఆది, అంతం లేని అమరానందమే. యుగాలు మారినా, కొత్త తరతరాలు పుట్టుకొచ్చినా ఎప్పటికీ నిలిచి ఉండేది, మనిషిని నిలిపేది ప్రేమ. ఇంతటి ఘనమైన ప్రేమను సెలబ్రేట్​ చేసుకునే రోజు ఫిబ్రవరి 14. మరి, ఈసారి ప్రేమికుల రోజున మీ ప్రియమైన వారితో కలిసి బయటికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేండి. హైదరాబాద్​లో ప్రేమ జంటలు విహరించడానికి ఎన్నో చక్కటి ప్లేస్​లు ఉన్నాయి. నచ్చితే మీరూ మీ మనసుకు నచ్చిన వారితో వెళ్లి, ఆ జ్ఞాపకాలను మనసులో ముద్రించుకోండి.

ఫలక్​నుమా ప్యాలెస్​: హైదరబాద్ నగరానికి చారిత్రక చిహ్నంగా నిలిచే చార్మినార్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఫలక్​నుమా ప్యాలెస్ ఉంది. ఫలక్‌నుమా అనేది ఉర్దూ పదం. తెలుగులో ‘ఆకాశ దర్పణం’ అని అర్థం. ఇది ప్రేమ జంటలు వెళ్లడానికి పర్ఫెక్ట్​ ప్లేస్. ఇక్కడికి వెళ్లిన వారు రాయల్​ డైనింగ్​ను అనుభూతి చెందవచ్చు. కపుల్స్​ కోసం క్యాండిల్​ లైట్​ డిన్నర్​కు కూడా ఉంటుంది.

దుర్గం చెరువు: ప్రకృతిలో గడపాలనుకునే జంటలకు ఇదో చక్కటి ప్రదేశం. ఇ‍క్కడి ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయని చెప్పటంలో అతిశయోక్తిలేదు. ప్రశాంతమైన వాతావరణంలో బోటింగ్ చేస్తూ ఎంజాయ్​ చేయవచ్చు. రాక్‌ క్లైంబింగ్‌, ట్రెక్కింగ్‌ వంటి వాటికి అవకాశం ఉంటుంది.

చౌమహల్లా ప్యాలెస్: 18వ శతాబ్ధం నాటి అద్భుతమైన చారిత్రక కట్టడం 'చౌమహల్లా ప్యాలెస్'. 14 ఎకరాల ప్రదేశంలో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్​లో చూపు తిప్పుకోనివ్వని అద్భుతమైన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. 2010లో యునెస్కో ఈ ప్యాలెస్​కు సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా అవార్డు కూడా అందించింది.

అనంతగిరి కొండలు: సహజ సిద్ధ ప్రకృతి వాతావరణం మధ్య హైదరాబాద్​కు కొద్ది దూరంలో అనంతగిరి కొండలు ఉన్నాయి. మూసీ నది జన్మస్థానంగా చెప్పే ఈ ప్రాంతం పక్షుల కిలకిలలు, పచ్చని అడవుల మధ్య ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో తమ ప్రేమ ఊసులు చెప్పుకోవడానికి ఇది ఎంతగానో బాగుంటుంది.

రామోజీ ఫిల్మ్​ సిటీ: హైదరాబాద్​లో కచ్చితంగా సందర్శించాల్సిన మరొక ప్రాంతం రామోజీ ఫిల్మ్ సిటీ. సుమారు 2 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న RFC, ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. సినీ రంగానికి మాత్రమే కాకుండా, టూరిస్టులకు సైతం ప్రముఖ డెస్టినేషన్​గా ఉంది. సినిమా షూటింగ్‌ ప్రదేశాలను చూసి సరికొత్త అనుభూతికి లోనవుతారు. ప్రకృతి అందాన్ని ఆస్వాదించడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. అనేక రకాల థీమ్ పార్కులు, రైడ్స్​, గేమ్స్ వంటివి ఎన్నో ఉన్నాయి.

నెక్లెస్​ రోడ్​: రాత్రి వేళ నెక్లెస్‌ రోడ్‌ అందాలు చూడటంలో మజానే వేరు. ఇక్కడి రోడ్డు ట్యాంక్‌బండ్‌ చుట్టూ నెక్లస్‌ ఆకారంలో ఒంపు తిరిగి ఉన్న కారణంగా ఈ ప్రదేశానికి నెక్లెస్ రోడ్‌ అని పేరు. ఇక్కడికి దగ్గరలో ఉన్న పురాతన రెస్టారెంట్లు, హోటళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాయంత్రం సమయంలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని అలా నడుస్తుంటే ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదనిపిస్తుంది.

ట్యాంక్​ బండ్​: ప్రేమ పక్షులు నిత్యం సేదతీరే ప్రదేశాలలో ట్యాంక్‌బండ్‌ ఒకటి. ట్యాంక్‌బండ్‌ అందచందాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. సాయంత్రాన ట్యాంక్‌బండ్‌ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. సాగర్‌లో బోటింగ్‌ చేస్తూ నీటి మధ్యలో ఉన్న ఎత్తైన బుద్ధున్ని చూస్తూ ప్రేమికుల రోజును ఎంజాయ్​ చేయవచ్చు.

గోల్కొండ: వందల ఏళ్లనాటి ఈ కట్టడం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ఉంది. దేశం నలువైపుల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు దీన్ని చూడటానికి వస్తుంటారు. 400 అడుగుల ఎత్తైన గ్రానైట్ కొండపై నిర్మించిన ఈ కోటను భారతదేశంలోని పురావస్తు అద్భుతాల్లో ఒకటిగా చెబుతారు. మీ పార్ట్​నర్​తో కలిసి వెళ్లడానికి ఈ ప్లేస్​ బెస్ట్​.

NTR గార్డెన్స్​: హుస్సేన్​సాగర్‌కు సమీపంలో ఉన్న మరో అద్భుతం ఎన్టీఆర్​ గార్డెన్స్​. 36 ఎకరాల్లో ఉన్న ఈ పార్కు నగరం మధ్యలో బిర్లామందిర్‌, నెక్లస్‌ రోడ్డులకు దగ్గరగా ఉంది. ఇక్కడ స్వర్గీయ నందమూరి తారకరామారావు మ్యూజియం ఓ ప్రత్యేక ఆకర్షణ.

తెలుగు రాష్ట్రాల "ప్రయాగ్​ రాజ్​లు" ఇవే! - త్రివేణి సంగమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

విదేశీ అందాలు మన దేశంలోనే - ఫారిన్ ట్రిప్​ ఫీలింగ్​ కలిగించే ప్రాంతాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.