తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఆంధ్రా స్టైల్ "ఉల్లిపాయ పులుసు" - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా! - వేడి వేడి అన్నంలో తింటే అమృతమే! - ULLIPAYA PULUSU RECIPE

ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు - ఉల్లిపాయలతో నిమిషాల్లో చేసుకునే సూపర్ రెసిపీ!

ONION PULUSU
Ullipaya Pulusu Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2024, 3:42 PM IST

Ullipaya Pulusu Recipe :కొన్నిరకాల కూరల్లో, సాంబారులో ఆనియన్స్ వేస్తేనే రుచి. అలాగని ఎప్పుడూ ఇతర పదార్థాలతో వాటిని కలిపి వండితే ఏం మజా ఉంటుంది. అందుకే.. ఈసారి కేవలం ఉల్లిపాయలతోనే ప్రిపేర్ చేసుకునేలా ఒక అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. అదే.. ఆంధ్రా స్టైల్ "ఉల్లిపాయ పులుసు". ఒక్కసారి టేస్ట్ చేశారంటే.. మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. అంత రుచికరంగా ఉంటుంది ఈ కర్రీ. వేడి వేడి అన్నంలో దీన్ని వేసుకొని తింటుంటే అమృతమే! పైగా ఈ కర్రీని చేసుకోవడం చాలా సులువు! మరి, ఈ సూపర్ టేస్టీ ఆనియన్ పులుసుకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఆయిల్ - 4 టేబుల్‌స్పూన్లు,
  • సాంబారు ఉల్లిపాయలు - పది
  • వెల్లుల్లి రెబ్బలు - పది
  • టమాటా - 1
  • చింతపండు - ఉసిరికాయంత
  • ఇంగువ - చిటికెడు
  • కరివేపాకు రెమ్మలు - 3
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ధనియాలు - చెంచా
  • ఎండుమిర్చి - 3
  • చక్కెర - 2 టేబుల్​స్పూన్లు
  • శనగపప్పు - చెంచా
  • మిరియాలు - చెంచా
  • మెంతులు - పావుచెంచా
  • జీలకర్ర - చెంచా
  • ఆవాలు - చెంచా
  • మినప్పప్పు - చెంచా

రాజస్థాన్‌ స్పెషల్ "ఎండుమిర్చి ఉల్లిపాయ చట్నీ"- ఇలా సింపుల్​గా చేస్తే టేస్ట్​ అదుర్స్​ అంతే!!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్​లో చింతపండునినానబెట్టుకుని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన సాంబారు ఉల్లిపాయలను(చిన్న సైజ్​వి) పొట్టు తీసి సైడ్స్ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. టమాటాను కట్ చేసి పెట్టుకోవాలి.
  • ఒకవేళ సాంబారు ఉల్లిపాయలులేనట్లయితే మామూలు ఉల్లిపాయలనే కాస్త మందంగా పొడవుగా కట్ చేసుకొని వాడుకోవచ్చు.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని చెంచా నూనె వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ధనియాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మిరియాలు, మెంతుల్ని వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీ జార్​ తీసుకొని అందులో వేయించుకున్న మసాలా దినుసుల్ని వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని మిగిలిన ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి.
  • అవి వేగాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సాంబారు ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటా ముక్కలు వేసి కలిపి ఆనియన్స్ కాస్త రంగు మారి మెత్తబడే వరకు వేయించుకోవాలి.
  • ఉల్లిపాయ ముక్కలు వేగాయనుకున్నాక అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాపొడి, చింతపండురసం, కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి.
  • అలా ఉడికించుకునేటప్పుడే తగినంత ఉప్పు, చక్కెరవేసి బాగా కలిపి పులుసు కాస్త దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి.
  • ఇక చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "ఉల్లిపాయ పులుసు" రెడీ!

ఇది బ్యాచిలర్స్ స్పెషల్ - కేవలం ఉల్లిపాయలతో సూపర్ కర్రీ! - అన్నం, చపాతీలోకి అదుర్స్​!

ABOUT THE AUTHOR

...view details