Foreigners Most Searched Places in India:భారతదేశాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో.. మన దేశంలో ఫేమస్ టూరిస్టు ప్లేసులు ఏమేం ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అంటూ.. ఆన్లైన్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. మరి.. ఈ మేరకు "బుకింగ్ డాట్ కామ్" అనే పర్యాటక సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది. మరి ఇందులో ఉన్న టాప్ 10 ప్రాంతాలు ఇవే.
దిల్లీ:ఈ జాబితాలో దేశ రాజధాని దిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. దిల్లీలోని కుతుబ్ మినార్, ఎర్రకోట, ఇండియా గేట్, హుమాయున్ టూంబ్స్ వంటి చారిత్రక కట్టడాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ముంబయి:'ద సిటీ ఆఫ్ డ్రీమ్స్', దేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబయి ఎల్లప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఇక్కడికి విదేశీయులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చారిత్రక గేట్ వే ఆఫ్ ఇండియా, జుహూ బీచ్ లాంటి ప్రదేశాలపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
బెంగళూరు:టెక్నాలజీ క్యాపిటల్‌గా పిలుచుకునే కర్ణాటక రాజధాని బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఉండే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్, బెంగళూరు ప్యాలెస్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇదే కాకుండా అనేక చారిత్రక ప్రదేశాలకు సమీపంలో ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో విదేశీ పర్యటకలు ఆసక్తి చూపిస్తారు.
చెన్నై:ఆ తర్వాత స్థానంలో తమిళనాడురాజధాని చెన్నై నిలిచింది. దీనికి సమీపంలో ఉండే అతి పురాతన ఆలయాలు, సంస్కృతి.. విదేశీ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మెరీనా బీచ్, మహాబలేశ్వరం, కపాలేశ్వర ఆలయం, సెయింట్ జార్జ్ కోట చెన్నైలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
హంపీ:ఒకప్పటి విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపీని విదేశీయులు ఎక్కువగా సెర్చ్ చేశారు. కర్ణాటకలోని హంపీ యూనెస్కో వారసత్వ గుర్తింపు సైతం పొందింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉండే పురాతన ఆలయాలు, కట్టడాలను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యటకులు వస్తారు.