తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోరూరించే "సీతాఫల్​ ఐస్​క్రీమ్​" - ఇలా చేస్తే టేస్ట్​ వేరే లెవల్​ బాస్​ - ఓసారి ట్రై చేస్తారా?

-రెగ్యూలర్​ ఐస్​క్రీమ్స్​ను మించిన టేస్ట్​ -పెద్దగా కష్టపడకుండా రుచికరమైన ఐస్​క్రీమ్​ రెడీ

SITAPHAL ICE CREAM
Custard Apple Ice Cream at Home (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Oct 22, 2024, 4:53 PM IST

How to Make Custard Apple Ice Cream at Home:ఐస్​క్రీమ్​ అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా చిన్నపిల్లలైతే దీని​ కోసం ఇంట్లో కొట్లాడుతారు కూడా. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లప్పుడు ఇవి పెట్టడం కామన్​. బటర్​స్కాచ్​, వెనీలా, చాక్​లేట్​, మ్యాంగో.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల ఫ్లేవర్లు ఉన్నాయి ఇందులో. ఇవన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో తినే ఉంటారు. అయితే ఎప్పుడూ ఇవే కాకుండా ఈసారి సీతాఫల్​ ఐస్​క్రీమ్​ ట్రై చేయండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. పైగా ప్రస్తుతం సీతాఫలాల సీజన్ కావడంతో ప్రతి ఒక్కరూ దీనిని ఇంట్లోనే ప్రిపేర్​ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సీతాఫల్​ ఐస్​క్రీమ్​ కోసం కావాల్సిన పదార్థాలు:

  • సీతాఫలం గుజ్జు - ఒకటిన్నర కప్పు
  • విప్పింగ్​ క్రీమ్​ - 1 కప్పు
  • పంచదార పొడి - 1 కప్పు
  • చల్లని పాలు - 1 కప్పు
  • కండెన్సెడ్​ మిల్క్​ - ముప్పావు కప్పు​

తయారీ విధానం:

  • ముందుగా సీతాఫలాల నుంచి గుజ్జును సపరేట్​ చేసుకోవాలి. ఇలా మొత్తంగా ఒకటిన్నర కప్పు పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరో బౌల్​లో విప్పింగ్​ క్రీమ్​ తీసుకోవాలి. ఇక్కడ విప్పింగ్​ క్రీమ్​ బదులు ఫ్రెష్​ క్రీన్​ కూడా వాడొచ్చు. ఇప్పుడు హ్యాండ్​ బ్లెండర్​ సాయంతో విస్క్​ చేసుకోవాలి. మొత్తంగా 5 నిమిషాల పాటు విప్పింగ్​ క్రీమ్​ను విస్క్ చేసి అది గట్టిగా అయ్యేవరకు చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర హ్యాండ్​ బ్లెండర్​ లేకపోతే విస్కర్​ సాయంతోనే క్రీమ్​ను గట్టిగా ప్రిపేర్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి బాగా చల్లగా ఉన్న పాలు, పంచదార పొడి, కండెన్సడ్​ మిల్క్​ వేసి విస్కర్​ సాయంతో బాగా కలుపుకోవాలి. ఇలా ఓ 4 నిమిషాలు ఆగకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత సీతాఫలం గుజ్జు వేసి మరో 5 నిమిషాల పాటు మిక్స్​ చేసుకోవాలి.
  • ఇలా మిక్స్​ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్​తో సహా ఫ్రీజర్​లో మూడు గంటల పాటు పెట్టాలి. ఇలా పెట్టే సమయంలో బౌల్​పై మూత పెట్టాల్సిన అవసరం లేదు.
  • మూడు గంటల తర్వాత ఆ బౌల్​ను తీసి మరోసారి కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని మరో 5 గంటల పాటు ఫ్రీజర్​లో స్టోర్​ చేసుకోవాలి. వీలేతై రాత్రంతా ఉంచుకోవచ్చు. అంతే ఆ తర్వాత తీస్తే ఐస్​క్రీమ్​ రెడీ. దీన్ని స్కూప్​ చేసుకుని తింటే టేస్ట్​ అద్దిరిపోతుంది. నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి..

ABOUT THE AUTHOR

...view details