ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

దేశంలో రైల్వేలైన్ లేని రాష్ట్రం - అక్కడి ప్రజలు ఆదాయ పన్ను కూడా చెల్లించరట! - RAILWAY LINE IN SIKKIM

దేశంలోనే రెండో అతి చిన్న రాష్ట్రం - తలసరి ఆదాయంలో నంబర్ వన్

railway_line_in_sikkim
railway_line_in_sikkim (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2025, 3:46 PM IST

Railway Line in Sikkim :భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా ఆ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ రైల్వే అందుబాటులోకి రాలేదు. అంతే కాదు అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఆదాయ పన్ను కూడా చెల్లించరు. దేశంలో ఎక్కడికైనా రైలులో ప్రయాణం చేయాలంటే వారు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిందే. 2009లోనే ఓ రైల్వే లైను నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా నేటీకీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతకీ ఆ రాష్ట్రం ఏమిటో, రైల్వే లైను ఏర్పాటు చేయకపోవడానికి, ఆదాయ పన్ను చెల్లించకపోవడానికి కారణాలేమిటో తెలుసుకుందామా!

భూభాగం వైశాల్యం పరంగా సిక్కిం భారతదేశంలోని రెండో అతి చిన్న రాష్ట్రం. ఇక్కడ రైల్వే వ్యవస్థ లేకపోవడంతో స్థానిక ప్రజలకు రైలు ప్రయాణాలపై పెద్దగా అవగాహన లేదు. ఇన్నాళ్లయినా రైలు కూత కూడా వినకపోవడానికీ అదే కారణం. ఒకవేళ దేశంలో ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్​కు వెళ్లాల్సి ఉంటుంది. సిలిగురి, జల్పాయ్ గురి రైల్వే స్టేషన్లు సిక్కిం ప్రజలకు సమీపంలో ఉంటాయి.

మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!

సిక్కిం రాష్ట్రం (ETV Bharat)

సిక్కిం రాష్ట్రంలో రైల్వే లైన్లు లేకపోవడానికి ప్రధాన కారణం అక్కడి భౌగోళిక పరిస్థితులు. రాష్ట్రమంతా హిమాలయ పర్వతాల్లోనే ఉంటుంది. దాంతో భూభాగం చాలా ఎత్తుపల్లాలతో, కొండలు, గుట్టలతో నిండి ఉంటుంది. ఈ కారణంతోనే రైల్వే లైన్లు నిర్మించడం సాధ్యపడలేదు. పైగా స్థానికంగా భిన్నమైన వాతావరణం రైల్వే విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారింది. తరచూ కొండచరియలు విరిగిపడడంతో పాటు వాతావరణ సమస్యల వల్ల రైల్వే లైన్ల నిర్మాణం, నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకుంది. రాష్ట్రంలో జనాభా కూడా తక్కువే. 2011 గణన ప్రకారం రాష్ట్ర జనాభా 6,10,577 కాగా, జన సాంద్రత చదరపు కిలోమీటర్​కు 86మాత్రమే. ఈ కారణంతో రైల్వే లైన్ల నిర్మాణంలో జాప్యం జరిగింది.

2009 సంవత్సరంలో సిక్కింలో నూతన రైల్వే లైనుకు శంకుస్థాపన జరిగింది. సిక్కింలోని శివోక్ అనే ప్రాంతం నుంచి పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్​లో ఉన్న రంగ్​పో వరకు ఈ రైల్వే లైను పనులు ప్రస్తుతం పూర్తి కావచ్చాయి. దీని పొడవు 44 కిలో మీటర్లు మాత్రమే అయినా అంత తక్కువ దూరానికి ఇంత సమయం పట్టడానికి భౌగోళిక పరిస్థితులే కారణం. అటవీ ప్రాంత పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వన్యప్రాణులకు ప్రమాదం జరగకుండా రైల్వే ట్రాక్ కు ప్రత్యేకమైన సెన్సార్లు అమర్చుతున్నారు.

ఆదాయపన్ను కట్టని ఏకైక భారత రాష్ట్రం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం దేశమంతటా బడ్జెట్ పైనే చర్చ జరుగుతోంది. వేతన జీవులు మొదలు బడా వ్యాపార వేత్తలు సైతం ఆదాయపన్ను శ్లాబులపైనా చర్చించుకుంటున్నారు. కానీ, సిక్కిం ప్రజలకు ఆదాయపన్నుపై అస్సలు ఆందోళన లేదు. ఎందుకంటే వారు ఆదాయపన్ను అనేదే చెల్లించడం లేదు. పన్ను కట్టకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోకపోవడానికి కారణం లేకపోలేదు. రాచరిక స్వతంత్ర రాజ్యంగా ఉన్న సిక్కిం 1975లో 22వ రాష్ట్రంగా భారత్‌లో విలీనమైంది. తాము ప్రజలకు పన్నులు విధించలేదని, ఇప్పుడు కూడా ఆ విధానాన్నే అనుసరిస్తామని విలీన సమయంలో పాలకులు విధించిన షరతులకు భారత ప్రభుత్వం అంగీకరించడమే అందుకు కారణం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయంతో దేశంలోనే సిక్కిం ప్రథమ స్థానంలో నిలవడం విశేషం.

చనిపోయి తిరిగొస్తే ఎంత బాగుంటుందో! - జపాన్​లో మళ్లీ పుట్టేందుకు జనం క్యూ

'పద్మ' అవార్డు గ్రహీతలకు ఎలాంటి ప్రయోజనాలు? - ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందా?

ABOUT THE AUTHOR

...view details