jonna kichidi recipe in telugu : చిరుధాన్యాల్లో జొన్నలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. పోషక విలువల పరంగా జొన్నల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు (ముఖ్యంగా బి విటమిన్లు), ఖనిజాలు (ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి), యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం వంటి అజీర్తి సమస్యలను నివారిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జొన్నలు నెమ్మదిగా జీర్ణమయ్యే గుణం కలిగి ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయి నియంత్రిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంచడానికి సహాయపడతాయి కాబట్టి ఈ ఆహారం షుగర్ పేషెంట్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఆ నూడుల్స్ మసాలా సీక్రెట్ ఇదే! - ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు
జొన్నలలోని ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించడం వల్ల ఆకలిని తగ్గించి బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని పిండి పదార్థాలు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి కాబట్టి జొన్నలను వివిధ రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. వాటితో రొట్టెలు, జావ, ఉప్మా, కిచిడీ వంటివి తయారు చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం చెప్పుకొనే రెసిపీ జొన్న కిచిడీ. ఇది బియ్యానికి మించి వందల రెట్ల శక్తిని అందిస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులకు బలమైన ఆహారం. అలాగని వారే కాదు, ఎవరైనా సరే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ లోకి ఈ కిచిడీ తినొచ్చు. కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవాళ్లు ఈ కిచిడీ ట్రై చేస్తే వారం రోజుల్లోనే మంచి మార్పు తప్పక కనిపిస్తుంది.
తయారీకి కావాల్సిన పదార్థాలు :
- నెయ్యి
- జిలకర్ర - 1 టీస్పూన్
- లవంగాలు - 4
- దాల్చిన చెక్క -1 ఇంచు
- బిర్యానీ ఆకు - 1
- పచ్చిమిర్చి - 1
- కరివేపాకు - 1
- అల్లం తరుగు - 1 టీస్పూన్
- క్యారెట్ - అరకప్పు
- బటానీ - అరకప్పు
- పసుపు - పావు చెంచా
- పెసలు - పావు కప్పు
- ఉప్పు - తగినంత
- జొన్న రవ్వ - 1 కప్పు
- మూడు కప్పుల నీళ్లు
పాతకాలపు 'ఉప్మా' తయారీ విధానం - ఇలా చేస్తే మీకు 100 మార్కులు గ్యారెంటీ!
కిచిడీలోకి రైతా ఇలా :
- పెరుగు -300 గ్రాములు
- సైంధవ లవణం - చిటికెడు
- వేయించిన జీలకర్ర పొడి - అర చెంచా
- మిరియాల పొడి - అర చెంచా
- చాట్ మసాలా - కొద్దిగా
- మీడియం కీర దోస తరుగు
తయారీ పద్ధతి :
జొన్న కిచిడీ తయారీ సులభమే. ముందుగా పొయ్యిపై కడాయి పెట్టుకుని సరిపడా నెయ్యి లేదా నూనె పోసుకోవాలి. వేడెక్కిన తర్వాత జిలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఒకటి వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించాలి.
ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని నిమిషం పాటు వేయించాలి. దీంట్లో అల్లం తరుగు కలుపుకొని క్యారెట్ తరుగుతోపాటు, పచ్చి బటానీ వేసుకోవాలి. కడాయిపై మూతపెట్టి 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ లో వాటన్నింటినీ మగ్గించుకోవాలి. తర్వాత పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు నాలుగు గంటల పాటు నానబెట్టిన పెసలు వేసి నాలుగు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి.
మళ్లీ మూడు కప్పుల నీళ్లు పోసి మరిగించుకుని తగినంత ఉప్పు వేసుకుని సుమారు ఆరు గంటల పాటు నానబెట్టిన సన్నని జొన్న రవ్వ పోసి కలుపుకోవాలి. మరుగుతున్న సమయంలోనే అవసరమైతే మరో మూడు కప్పుల నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. అంతే చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని, నెయ్యి వేసుకుని దించుకోవడమే. ఈ కిచిడీలోకి కీరదోస రైతా చాలా బాగుంటుంది.
కిచిడీలోకి దోసకాయ రైతా కోసం పెరుగును చిక్కగా చిలక్కొట్టాలి. అందులోకి చిటికెడు సైంధవ లవణం, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడితో పాటు చాట్ మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్‌గా మీడియం కీర దోస తరుగు వేసుకుని కలుపుకొంటే రైతా రెడీ అయినట్లే!
అతి ప్రాచీన వంటకం 'కుంభకోణం సాంబార్' - జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాల్సిందే!
ఎన్ని వెరైటీలున్నా కరివేపాకు చికెన్ క్రేజ్ వేరే! - సింపుల్ టిప్స్‌తో సూపర్ టేస్ట్