తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పాకం లేకుండానే "కమ్మటి అరిసెలు" ఇలా చేసుకోండి - టేస్ట్​ అద్దిరిపోతాయి! - HOW TO MAKE ARISELU WITHOUT PAKAM

- తడి పిండి అవసరం లేదు - పాకం పట్టాల్సిన పనిలేదు

How to Make Ariselu Without Pakam
How to Make Ariselu Without Pakam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 9 hours ago

How to Make Ariselu Without Pakam: సంక్రాంతి అంటేనే భోగి మంటలు, పిండి వంటలు. ఈ పిండి వంటల్లో అందరి నోరూ ఊరించే వంటకం అరిసెలు. కాని.. అరిసెలు చేయడం కొంచెం కష్టమే. ఎందుకంటే బెల్లం పాకం సరిగ్గా కుదరలేదంటే వాటిని చెత్తడబ్బాలో పడేయాల్సిందే. అరిసెల రుచి మొత్తం పాకంలోనే ఉంటుంది. అయితే.. ఈ పాకం పట్టుకునే పనిలేకుండా అరిసెలు చేసుకునే పద్ధతి ఉంటే బాగుండు అని చాలా మంది అనుకుంటుంటారు. అలాంటివారి కోసమే ఈ రెసిపీ​ తీసుకొచ్చాం. వీటిని తయారు చేయడం చాలా ఈజీ. మరి, లేట్​ చేయకుండా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • బియ్యప్పిండి - 1 కప్పు
  • గోధుమ పిండి - అర కప్పు
  • బెల్లం - 1 కప్పు
  • నీళ్లు - కప్పున్నర
  • నెయ్యి - సరిపడా
  • యాలకుల పొడి - 1 టీ స్పూన్​
  • నువ్వులు - 1 టీ స్పూన్​
  • నూనె - డీ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా ఓ ప్లేట్​లోకి బియ్యప్పిండి, గోధుమ పిండి వేసి కలిపి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి గిన్నె పెట్టి బెల్లం, నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టుకోవాలి.
  • మరో పాన్​ స్టవ్​ మీద పెట్టుకుని వడకట్టిన బెల్లం నీళ్లు, 1 చెంచా నెయ్యి, యాలకుల పొడి, నువ్వులు వేసి కలిపి నీళ్లు మరిగించుకోవాలి.
  • నీళ్లు మరుగుతున్నప్పుడు ముందే కలిపిన బియ్యప్పిండి, గోధుమపిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.
  • ఆ తర్వాత మధ్యమధ్యలో నెయ్యి వేసుకుంటూ పిండి మిశ్రమం గిన్నెకు అంటుకోకుండా దగ్గరగా అయ్యేవరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
  • పిండి దగ్గరకు అయిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పిండి గట్టి పడకుండా మూత పెట్టి చల్లార్చుకోవాలి.
  • ఈలోపు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె కాగేలోపు గోరువెచ్చగా ఉన్న పిండి ముద్దను ఓ ప్లేట్​లోకి తీసుకుని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • ఇప్పుడు బటర్​ పేపర్​ లేదా పాలీథిన్​ కవర్​ మీద నెయ్యి రాసి ఉండను ఉంచి అరిసెలుగా వత్తుకోవాలి.
  • వీటిని కాగుతున్న నూనెలో వేసి ఓ నిమిషం పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని నూనె లేకుండా వత్తుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇలా పిండి మొత్తాన్ని అరిసెలుగా చేసుకుంటే కేవలం నిమిషాల్లోనే పాకం పట్టే పని లేకుండా అరిసెలు రెడీ.
  • నచ్చితే మీరూ ఈ సంక్రాంతి పండక్కి ఓసారి ట్రై చేయండి.

ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ "అరిసెలు" చేసుకోండి - పర్ఫెక్ట్​ టేస్ట్​తో పొంగుతూ, సాఫ్ట్​గా వస్తాయి!

సంక్రాంతి స్పెషల్ : సూపర్ టేస్టీ "కొబ్బరి బూరెలు" - అరిసెలు రానివారు ఈజీగా చేసేయొచ్చు!

ABOUT THE AUTHOR

...view details