తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

బిర్యానీ, చపాతీ, పులావ్​లోకి​ అద్దిరిపోయే సైడ్ డిష్ - ఆహా అనిపించే "ఆలూ కుర్మా" - చిటికెలో చేసుకోండిలా! - ALOO KURMA RECIPE

ఆలూతో నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే సూపర్ రెసిపీ - ఒక్కసారి తిన్నారంటే ఎవరైనా టేస్ట్​కి బలాదూర్!

How to Make Aloo Kurma
Aloo Kurma (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2024, 12:40 PM IST

How to Make Aloo Kurma in Telugu :చాలా మంది ఆలూతో చేసిన వంటకాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. పిల్లలైతే బంగాళదుంపలతో చేసే వాటికి ఫ్యాన్స్ అయిపోతారు. అయితే, ఎప్పుడూ ఆలూతో రొటిన్​ రెసిపీలే కాకుండా ఈసారి కొత్తగా ఇలా "బంగాళదుంప కుర్మాని" ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉండే ఈ కర్రీ చపాతీ, పూరీ, పులావ్, బిర్యానీ వంటి వాటిల్లోకి మంచి కాంబినేషన్​గా నిలుస్తుంది. పైగా ప్రిపరేషన్ కూడా చాలా సులువు! ఇంతకీ, ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బంగాళదుంపలు - 3
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • దాల్చినచెక్క - అంగుళం ముక్క
  • లవంగాలు - 3
  • యాలకులు - 2
  • ఉల్లిపాయ - 1(మీడియం సైజ్​ది)
  • పచ్చిమిర్చి - 3
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - అరటీస్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - అరటీస్పూన్
  • కరివేపాకు - 1 రెమ్మ
  • పెరుగు - 3 నుంచి 4 టేబుల్​స్పూన్లు
  • కారం - తగినంత
  • జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • గరంమసాలా పౌడర్ - 1 టీస్పూన్
  • కసూరి మేతి - 1 టీస్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

యమ్మీ యమ్మీగా "ఆలూ 65" - ఇలా చేశారంటే టేస్ట్​ మరో లెవల్​!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బంగాళదుంపలనుశుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. తర్వాత వాటిపై పొట్టు తొలగించి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి లైట్​గా వేయించుకోవాలి.
  • ఆ తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక ఆ మిశ్రమంలో ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం పెరుగు వేసుకోవాలి. ఆపై స్టౌను లో ఫ్లేమ్​లో ఉంచి పెరుగుమిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి.
  • అలా మిశ్రమాన్ని వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • అనంతరం అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలిపి స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మిశ్రమం కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత గరంమసాలా పౌడర్, కసూరి మేతి వేసుకొని బాగా కలిపి ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఇక చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దింపుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "ఆలూ కుర్మా" రెడీ!

ధాబా స్టైల్ "ఆలూ పాలక్ కర్రీ" - ఒక్కసారి టేస్ట్ చేశారంటే, పాలకూరే కావాలంటారు!

ABOUT THE AUTHOR

...view details