తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కూర గిన్నెలు మాడిపోయాయా? - బంగాళదుంపలతో ఇలా చేయండి - నిమిషాల్లో కొత్తవాటిలా మెరుస్తాయి! - POTATO HOUSEHOLD USES IN TELUGU

బంగాళదుంపలతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఆలూతో చెక్క ఫర్నీచర్​ మిలమిల

Potato Household Uses
Potato Household Uses (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2024, 11:31 AM IST

Potato Household Uses: దుంపజాతికి చెందిన కూరగాయల్లో బంగాళ దుంప ఒకటి. దీనినే ఆలుగడ్డ, ఉర్లగడ్డ, పొటాటో అని వివిధ పేర్లతో పిలుస్తారు. బంగాళదుంపలతో చేసిన వంటకాలను దాదాపు అందరూ ఇష్టపడతారు. చాలా మంది ఎంతో ఇష్టంగా ఆలూతో చేసిన కూరలు, స్నాక్స్​ ఆరగిస్తూ ఉంటారు. ఇక పిల్లలైతే కనీసం వారానికి ఓ రెండుమాడు సార్లు అయినా పొటాటో కర్రీ చేయమని గోల చేస్తుంటారు. ఇలా ఇది మన రోజువారి జీవితాల్లో భాగం అయ్యింది. అయితే ఆలుగడ్డతో కేవలం కూరలు, తదితర వంటకాలు మాత్రమే కాకుండా ఎన్నో రకాలుగా దీనిని వాడొచ్చు. మరి ఆ ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

బంగారు, వెండి వస్తువులు: బంగాళదుంపలను ఉడకబెట్టిన నీళ్లను కొన్ని తీసుకుని అందులో చెంచా డిటర్జెంట్‌ పౌడర్‌ వేయాలి. దీంట్లో నగలను వేసి ఒక గంటపాటు నాననివ్వాలి. ఆ తర్వాత వాటిని టూత్‌ బ్రష్‌తో మృదువుగా రుద్దితే కొత్తవాటిలా మెరుస్తాయి. ఇక వెండి ఆభరణాలు వంటివి కొన్నాళ్లకు నల్లబడి పోతుంటాయి. వాటిని తిరిగి తెల్లగా మార్చటం కోసం.. బంగాళ దుంపలు ఉడకించిన నీళ్లల్లో వెండి వస్తువుల్ని కాసేపు ఉంచి తరువాత బ్రష్​తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే నల్ల బడ్డ వెండి వస్తువులు తళతళ మెరుస్తాయని అంటున్నారు.

ఐరన్​: తుప్పుపట్టిన స్టీలు, ఐరన్ పాత్రలను తిరిగి కొత్తవాటిలా మార్చటంలో బంగాళ దుంప బాగా పనిచేస్తుంది. అందుకోసం బంగాళ దుంపను కొంచెం మందంగా కట్​ చేసి.. సోప్ లిక్విడ్​లో ముంచి తుప్పు పట్టినపాత్రలపై రుద్ది.. ఆ తర్వాత మంచి నీటితో కడిగేస్తే క్షణాల్లోనే తుప్పు తొలగిపోతుందని అంటున్నారు. అలాగే కటింగ్​ కోసం ఉపయోగించే కత్తులు వంటివి తుప్పు పట్టిననప్పుడు.. దానిని వదిలించుకునేందుకు బంగాళ దుంప ముక్కను వాటిపై రుద్ది 5నిమిషాలు ఉంచాక నీటితో కడగి పొడి వస్త్రంతో తుడిస్తే కొత్తవాటిలా మెరవడంతో పాటు పదనుగా ఉంటాయని అంటున్నారు.

మాడిన గిన్నెలు: కొన్ని సందర్భంలో గిన్నెలు మాడి నల్లగా తయారవుతుంటాయి. అలాంటప్పుడు బంగాళదుంప ముక్కను నిమ్మరసంలో ముంచి మాడిన ప్రదేశాల్లో రుద్దాలి. అరగంట తరువాత వాటిని సబ్బునీటితో రుద్ది కడిగితే మాడిన మరకలు పోతాయంటున్నారు.

మిర్రర్స్​: ఇంట్లో ఉండే డ్రస్సింగ్ మిర్రర్లు, గ్లాస్ కిటికీలు, కళ్లద్దాలు మసకబారినట్లు కనిపిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో వాటిని శుభ్రం చేయటానికి బంగాళదుంప ముక్కను తీసుకుని రుద్దితే సరిపోతుందని అంటున్నారు. దుంపలోని స్టార్చ్ అద్దాలు మసకబారకుండా చేయటంలో దోహదం చేస్తాయని అంటున్నారు.

చెక్క ఫర్నిచర్​: చెక్కవస్తువులు, లెదర్ బ్యాగులు, తదితర వస్తువుల్ని శుభ్రం చేసుకునేందుకు బంగాళ దుంపబాగా పనిచేస్తుంది. బంగాళ దుంపముక్కలకు వెనిగర్, టీ స్పూన్ ఉప్పు, చేర్చి స్పాంజితో చెక్క ఫర్నీచర్ పై రుద్దితే అవి తిరిగి కాంతివంతంగా మారతాయని అంటున్నారు.

దుస్తులు, కార్పెట్​లపై పడిన టమాట కెచప్​ వంటి మరకలను ఆలూతో వదిలించవచ్చని చెబుతున్నారు. ఆలూ ఉడికించిన నీటిలో స్పాంజ్​ను ముంచి మరక పడిన చోట రుద్దితే మరక వదిలిపోతుందని అంటున్నారు.

సూపర్ టిప్స్ : అద్దాలు, గాజు వస్తువులపై మరకలు ఎంతకీ పోవట్లేదా? - చిటికెలో కొత్తవాటిలా మెరిపించండి!

ఎన్నిసార్లు సర్దినా వార్డ్​రోబ్ చిందరవందరగా ఉందా? - ఈ తప్పులు సరిచేసుకుంటే నీట్​ అండ్​ క్లీన్​!​

టమాటాలను ఇలా నిల్వ చేసుకుంటే - త్వరగా కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయట!

ABOUT THE AUTHOR

...view details