ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

'రైతులకు గుడ్‌న్యూస్‌' పీఎం కిసాన్ నిధుల విడుదలకు సిద్ధం - జాబితాలో పేరుందో లేదో ఇలా తెలుసుకోండి! - PM KISAN SCHEME 2025

ప్రధానమంత్రి సమ్మాన్ నిధి 19వ విడత నిధుల విడుదల - ఈ కేవైసీ తప్పనిసరి

pm_kisan_scheme_2025
pm_kisan_scheme_2025 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2025, 5:28 PM IST

PM KISAN SCHEME 2025 : అన్నదాతలకు బడ్జెట్​లో పెద్దపీట వేసిన కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ లిమిట్ రూ.5లక్షలకు పెంచడం తెలిసిందే. ఆర్థిక చేయూతలో భాగంగా మరోవైపు ఏటా పెట్టుబడి సాయం కింద మూడు విడతల్లో 6వేల రూపాయలు అందిస్తోంది. ఇప్పటి వరకు 18 విడతల్లో నిధులు మంజూరు చేసిన కేంద్రం తాజాగా 19వ విడత నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

అన్నదాతలకు పెట్టుబడి సాయం పథకం పీఎం కిసాన్ నిధులు మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్నాయి. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 18సార్లు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నెల 24న 2వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. దేశ వ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌ అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఇ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

రైతులకు రూ.5లక్షల రుణం - 'కిసాన్ క్రెడిట్ కార్డ్' దరఖాస్తు ఇలా!

అర్హత, జాబితాలో పేరు ఇలా తెలుసుకోవచ్చు

పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించిన అర్హత స్టేటస్ తెలుసుకోవాలన్నా, పీఎం కిసాన్‌ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా https://pmkisan.gov.in/ లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు. వివరాలు పొందడానికి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ లేదా ఆధార్‌ నంబర్‌ నమోదు చేస్తే సరి.

లేదంటే కిందకు వెళ్లి బెనిఫిషియరీ లిస్ట్ క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ వివరాలు నమోదు చేయాలి. అర్హులైన రైతుల జాబితా ప్రత్యక్షమవుతుంది. జాబితాలో పేరు లేకుండా వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులను కలిసి ఈ కేవైసీ పూర్తి చేయించుకుంటే సరిపోతుంది

క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న రైతులు

పంట సాగులో ఆరుగాలం శ్రమించే అన్నదాతల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ, చాలా మందికి అవగాహన లేమి కారణంగా వాటిని అందుకోలేకపోతున్నారు. ఓ వైపు అధికారులు అవగాహన కల్పిస్తున్నా సమాచార లోపంతో లక్ష్యం నెరవేరడం లేదు. రాష్ట్రంలో వరితో పాటు వాణిజ్య, ఉద్యాన (హార్టికల్చర్) పంటలు అనేకం సాగవుతున్నాయి. కేంద్రం పీఎం కిసాన్‌ పేరిట ఏటా రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సైతం రాయితీపై విత్తనాలు, పంటల బీమా, పంట కొనుగోళ్లు చేపడుతోంది. అన్నదాత సుఖీభవ పథకం తదితర వాటికి లబ్ధిపొందాలంటే రైతులంతా ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులను కలిసి పంట వివరాలు నమోదు చేస్తున్నారు.

'అప్పుడు కట్నం తీసుకున్నాడు, ఇప్పుడు పొలంలో వాటా ఇవ్వాలంటున్నాడు!'

నాటి గడపే నేటి కడప! - జిల్లాలు, పట్టణాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details