ETV Bharat / offbeat

రేషన్ బియ్యంతో మెత్తని దూదిలాంటి ఇడ్లీలు - రవ్వ కొనాల్సిన అవసరమే లేదు! - RATION RICE RAVA IDLI

రవ్వ లేకుండానే రేషన్ బియ్యంతో ఇడ్లీ తయారు చేసుకోవచ్చు - రుచి కూడా తేడారాదు

ration_rice_rava_idli
ration_rice_rava_idli (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2025, 7:23 PM IST

Ration Rice Idli : రవ్వ లేకుండా రేషన్ బియ్యంతో ఇడ్లీలు చేసుకోవచ్చు. రవ్వతో ఇడ్లీలు చేసుకోవడం సర్వ సాధారణమే. దీని కోసం మార్కెట్లో దొరికే రవ్వ కిలో రూ.40కి పైగా ధర ఉంటోంది. అయితే, ఒక్కోసారి ఇంట్లో రవ్వ అయిపోయినపుడు ఇడ్లీలు చేసుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాదు. అందుకే రవ్వ లేకుండా రేషన్ బియ్యంతో ఇడ్లీలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

చాలా మంది రేషన్ బియ్యం తెచ్చుకోకుండా వదిలేస్తుండగా మరికొందరు వాటిని అక్కడికక్కడే అమ్ముకొంటున్నారు. ఇంకొందరు కేవలం దోసెలు, పొంగనాల వంటి టిఫిన్లలోకి అతి తక్కువగా వాడుకుంటున్నారు. చాలా మందికి రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వ తయారు చేసుకోవచ్చనే విషయం తెలియదు. అసలు విషయం ఏమిటంటే రవ్వ లేకుండానే బియ్యంతోనే ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు.

"నెల్లూరు రసం" చిటికెలో ఇలా చేసేయండి! - అన్నం వదిలేసి రసం తాగేస్తారంతే!

ఇడ్లీ తయారీలో రవ్వకు బదులుగా శుభ్రం చేసి పెట్టుకున్న రేషన్ బియ్యం చేర్చుకుంటే సరిపోతుంది. ఇవి కూడా రవ్వతో చేసిన ఇడ్లీల మాదిరిగానే మెత్తగా ఉంటాయి. రుచి కూడా ఎంతో బాగుంటుంది. రేషన్ బియ్యం (Ration Rice) తో చేసిన ఇడ్లీ, రవ్వతో చేసిన వాటికి ఏ మాత్రం తేడా ఉండదు.

ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు

  • బియ్యం - 4 కప్పులు
  • మినప్పప్పు - 1 కప్పు
  • (పొట్టు తీయని మినప్పప్పు రుచిగా ఉంటుంది)
  • మెంతులు - 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు - తగినంత
  • నూనె - (ఇడ్లీ పాత్రలో రాసుకోవడానికి సరిపడా)

తయారీ విధానం

  • రేషన్ బియ్యంలో రాళ్లు, వ్యర్థాలు, దుమ్ము ఎక్కువగా ఉంటుంది. అందుకే ముందుగా బియ్యంలో రాళ్లు, ఇతర వ్యర్థాలు తొలగించుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి. మూడు కప్పుల బియ్యం ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని 6గంటలు నానబెట్టుకోవాలి. మరో గిన్నెలో 1 కప్పు మినప్పప్పు నాన పెట్టుకోవాలి.
  • ఉదయం నానబెట్టిన బియ్యం, మినప్పప్పును సాయంత్రం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నీళ్లు పోయకూడదని గుర్తుంచుకోండి. గ్రైండర్​లో అయితే రుచి బాగా వస్తుంది.
  • మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఉదయం ఇడ్లీలు వేసుకోవడానికి రాత్రంతా పులియబెట్టాలి.
  • ఉదయం ఇడ్లీ బ్యాటర్ మనకు కావల్సినంత వేరే గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఇడ్లీ పాత్రలో పిండి వేసుకుని ఉడికించుకుంటే రవ్వ ఇడ్లీ మాదిరిగానే వస్తాయి.
  • ఎప్పుడూ ఒకే రకం కాకుండా, ఇడ్లీ రవ్వ లేని సమయాల్లో ఇలా చేసి చూడండి. నచ్చితే మళ్లీ, మళ్లీ చేసుకోవచ్చు.

ఇడ్లీలను ఎప్పటిలాగే పల్లీ చట్నీ లేదా కారం పొడితో ట్రై చేసి చూడండి అద్బుతంగా ఉంటాయి.

మెత్తటి ముక్కలతో నోరూరించే మటన్ ఫ్రై - ఇలా చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది!

'షుగర్ పేషెంట్లకు సూపర్ ఫుడ్'! - జొన్నపిండితో అప్పటికప్పుడు హెల్దీ దోసెలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.