Lord Shiva Devotees Lost Their Way in Forest: తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్‌కు చెందిన శివ స్వాములు కొందరు అడవిలో గూగుల్ మ్యాప్‌ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లి దారి తప్పారు. విషయాన్ని పోలీసుల ద్వారా తెలుసుకున్న రెస్క్యూ బృందం జీపీఎస్ ఆధారంగా వారుండే ప్రాంతానికి చేరుకుని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. వివరాల్లోకి వెళ్తే
ఇదీ జరిగింది: కొల్లాపూర్‌కు చెందిన మనోజ్, గురుప్రసాద్, రాజు, గోపాల్‌తో సహా మొత్తం ఏడుగురు ఇంద్రేశ్వరం బీట్ మీదుగా శ్రీశైలానికి నడుచుకుంటూ వెళ్తూ అడవిలో పాకశాల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియక దారి తప్పిపోయారు. తాము దారి తప్పిన విషయాన్ని సాయంత్రం 4 గంటల సమయంలో వారు పోలీసులకు ఫోన్ చేశారు.
ఈ విషయం పోలీస్ కంట్రోల్ రూం ద్వారా తమకు సమాచారం అందిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. రేంజర్ కృష్ణప్రసాద్ పర్యవేక్షణలో ఎఫ్ఎస్వో మగ్బుల్, ఎఫ్‌బీవో మద్దిలేటి ఆధ్వర్యంలో రెస్క్యూ బృందం జీపీఎస్ ఆధారంగా శివస్వాములు ఉండే లొకేషన్‌కు రాత్రి 8 గంటల సమయంలో చేరుకున్నారు. వారిని సురక్షితంగా ఆత్మకూరుకు తీసుకు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
శివభక్తులకు శుభవార్త -శైవ క్షేత్రాలకు 3,500 ప్రత్యేక బస్సులు
Success Secrets By Lord Shiva in Telugu: జీవితంలో విజయానికి.. మహా శివుడు చెప్పిన రహస్యాలివే..!