Health Benefits of betel leaves : ఇళ్లు, పొలాలు, పచ్చిక బయళ్లు ఇలా ప్రతి చోట నిత్యం ఎన్నో మొక్కలను మనం గమనిస్తుంటాం. వాటిలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆయా మొక్కలు శరీరంలోని వివిధ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం చూపుతున్నాయి. గాయాలు, చిన్న చిన్న రుగ్మతల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
'షుగర్ పేషెంట్లకు సూపర్ ఫుడ్'! - జొన్నపిండితో అప్పటికప్పుడు హెల్దీ దోసెలు
మన చుట్టూ ఉన్న పరిసరాల్లో అనేక మొక్కలు ఆయుర్వేద పరంగా కీలక భూమిక పోషిస్తున్నాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతున్నాయి. ఔషధ పరంగా తమలపాకులు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటిని పూజాది కార్యక్రమాల్లో విరివిగా ఉపయోగించడం వెనుక కారణం కూడా అదేనని ఆయుర్వేద పండితులు చెప్తుంటారు. ఔషధ మొక్కల్లో తమలపాకు ఆకులు, వేర్లు వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా ఆకులకు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నందున సంప్రదాయ వైద్యంలో ముఖ్యమైన స్థానం ఉంది.
తమలపాకుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
- తమలపాకుల్లో కు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ (తమలపాకుల ప్రయోజనాలకు సంబంధించి పరిశోధనల నివేదికల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) లక్షణాలున్నాయి.
- విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, కెరోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.
- తమలపాకుల్లో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.
- తమలపాకుల వేర్లు మన శరీరాన్ని వ్యాధుల బారి నుంచి రక్షించడంలో ఉపయోగపడతాయి.
- జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి తమలపాకులు సహాయపడతాయి.
- శ్వాసకోశ సమస్యలతో పాటు దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
- చిగుళ్ళను బలోపేతం చేయడంతో పాటు నోటి దుర్వాసనను తగ్గించడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
- తలనొప్పి, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి వంటి సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది.
- శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షించి రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది. మలబద్దకం సమస్య నుంచి గట్టెక్కాలంటే తమలపాకు మంచి ఔషధం.
- తమలపాకులు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
- యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగిన తమలపాకులు వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
- తమలపాకులను నమలడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది
తమలపాకుల చెట్లు పెరగడానికి పెద్ద లేదా ప్రత్యేకమైన స్థలం కేటాయించాల్సిన అవసరం లేదు. వాటిని చిన్న కుండీల్లో నాటుకుంటే సరిపోతుంది. చిన్న మొక్కలు ఏపుగా ఎదుగుతాయి. ఇవి గొంతు వ్యాధులు, దంత ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అనేక వ్యాధుల చికిత్సలో తమలపాకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు జలుబు, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తమలపాకులను విడిగా తీసుకోవచ్చు లేదా వాటి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుందట. తమలపాకు పొడిని దంతాలు, చిగుళ్లకు పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. నోటి ఆరోగ్యం, జీర్ణ, శ్వాసకోశ సమస్యలు, దగ్గు, జలుబు సమస్యలకు తమలపాకు దివ్యౌషధంగా పనిచేస్తుందట. శరీర బరువు తగ్గడంలో తమలపాకులు ఎంతో సహాయపడతాయి. తమలపాకుల నీల్లు తాగడం వల్ల మెరుగుపడి గ్యాస్, ఎసిడిటీ సమస్యను తొలగిస్తుంది.
శివరాత్రికి శ్రీశైలం, రామోజీ ఫిలిం సిటీ సందర్శన - IRCTC సరికొత్త ప్యాకేజీ!
మెత్తటి ముక్కలతో నోరూరించే మటన్ ఫ్రై - ఇలా చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది!