తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అప్పటికప్పుడు చేసుకునే "ఇన్​స్టంట్ పల్లీ చట్నీ" - అన్ని టిఫెన్స్​లోకి సూపర్ కాంబో!

ఇన్​స్టంట్ దోశలు, ఇడ్లీలు మాత్రమే కాదు - ఇన్​స్టంట్​గా పల్లీ చట్నీని చేసుకోండిలా!

Instant Peanut Chutney Recipe
Peanut Chutney Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2024, 5:27 PM IST

Instant Peanut Chutney Recipe : ఇంట్లో దోశ, ఇడ్లీ, వడ, బోండా.. ఇలా ఏ టిఫెన్ చేసుకున్నా అందులోకి పల్లీ చట్నీ ఉండాల్సిందే. అయితే, ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్, చట్నీ రెండు ప్రిపేర్ చేసుకోవాలంటే కొంత టైమ్ పడుతుంది. అలాకాకుండా మీ వంటింట్లో ముందుగానే ఈ పౌడర్ ప్రిపేర్ చేసిపెట్టుకోండి. ఏదైనా టిఫెన్ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇన్​స్టంట్​గా "పల్లీ పచ్చడి"ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్​ కూడా తాజా పల్లీ చట్నీ తిన్నట్టే ఉంటుంది. పైగా సమయం ఆదా అవుతుంది! ఇంతకీ, ఈ ఇన్​స్టంట్ పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • అర కప్పు - పల్లీలు
  • ముప్పావు కప్పు - పుట్నాల పప్పు
  • ఎనిమిది - ఎండుమిర్చి
  • ముప్పావు చెంచా - కారం
  • చెంచా - ఆవాలు
  • చెంచా - మినప్పప్పు
  • కొద్దిగా - చింతపండు
  • చెంచా - జీలకర్ర
  • రెండు టేబుల్​స్పూన్లు - నూనె
  • రుచికి సరిపడా - ఉప్పు
  • చెంచా - వెల్లుల్లి తరుగు
  • రెండు రెబ్బలు - కరివేపాకు

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై కడాయి పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • తర్వాత అదే కడాయిలో పుట్నాలపప్పు, ఆరు ఎండుమిర్చి, వెల్లుల్లి తరుగు వేసి దోరగా వేయించుకోవాలి. ఆపై అందులో చింతపండు వేసి తేమ పోయేదాకా వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి చల్లార్చుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, మిగిలిన ఎండుమిర్చి, కరివేపాకులను ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి.
  • అవి చక్కగా వేగాయనుకున్నాక.. అందులో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకొని కలియతిప్పుతూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. అది చల్లారిన తర్వాత తడిలేని గాలి చొరబడని సీసాలో స్టోర్ చేసుకోవాలి.
  • ఇక మీరు ఏదైనా టిఫెన్ చేసుకున్నప్పుడు అందులో నుంచి తగినంత పొడిని తీసుకొని కాసిని వేడినీళ్లలో వేసుకొని కలుపుకున్నారంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "ఇన్​స్టంట్ పల్లీ చట్నీ" రెడీ!
  • ఈ ఇన్​స్టంట్ పల్లీ చట్నీలోకి కావాల్సిన పౌడర్​ను ఒక్కసారి తగిన మొత్తంలో ప్రిపేర్ చేసుకున్నారంటే రోజూ చేయాల్సిన శ్రమ తప్పుతుంది. దీన్ని ఏ టిఫెన్​లోకి తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరు ఓసారి ఈ పౌడర్​ని ప్రిపేర్ చేసుకొని.. ఇన్​స్టంట్​గా పల్లీ చట్నీని తయారుచేసుకోండి!

ABOUT THE AUTHOR

...view details