తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

బరువు తగ్గించే "పీనట్ బటర్" - బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! - PEANUT BUTTER RECIPE

అధిక బరువుతో బాధపడుతున్నారా? - ఇలా 'పీనట్ బటర్' చేసుకొని తింటే మంచి ఫలితం!

HOW TO MAKE PEANUT Butter
Peanut Butter Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2025, 12:57 PM IST

Peanut Butter Recipe in Telugu :ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తమ డైలీ డైట్​లో అనేక మార్పులు చేసుకుంటుంటారు. ముఖ్యంగా మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో బరువు తగ్గాలనుకునే చాలా మంది బ్రెడ్ టోస్ట్, ఓట్​మీల్ వంటివి తీసుకుంటుంటారు. అలాంటి టైమ్​లో కొందరు టేస్ట్​ కోసం "పీనట్ బటర్" యూజ్ చేస్తుంటారు. నిజానికి ఇది బ్రెడ్ టోస్ట్, ఓట్​మీల్ రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ క్రమంలోనే చాలా మంది మార్కెట్ నుంచి పీనట్ బటర్ కొనుగోలు చేస్తుంటారు. అయితే, అలాంటి వాటిలో ప్రిజర్వేటివ్స్, రసాయనాలు కలిపే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలకు దారితీసే ఛాన్స్ లేకపోలేదు. కాబట్టి, అలాకాకుండా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేని పీనట్​ బటర్​ని ఈజీగా ప్రిపేర్​చేసుకోండి.

కావాల్సిన పదార్థాలు :

  • పల్లీలు - కావాల్సినన్ని
  • పల్లీల నూనె - కొద్దిగా
  • తేనె - 1 టీస్పూన్

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై కడాయి పెట్టుకొని పల్లీలను వేసి లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని వాటిపై ఉన్న పొట్టును తొలగించుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తీసుకున్న పల్లీలను వేసి మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • పల్లీలు బాగా మెదిగి మెత్తని ముద్దలా వచ్చాక రుచి కోసం తేనె, కాస్త పల్లీల నూనె వేసుకొని మరోసారి ఇంకాసేపు మిక్సీ పట్టుకోవాలి.
  • అప్పుడు అది జారుడుగా తయారవుతుంది. ఆపై దాన్ని ఏదైనా జార్​లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "పీనట్ బటర్" రెడీ!
  • దీన్ని టోస్ట్, చపాతీతోతింటుంటే ఆ టేస్ట్ సూపర్​గా ఉంటుంది. లేదంటే పండ్లతో సలాడ్స్ చేసుకున్నప్పుడు నిమ్మరసం, సాస్‌.. వంటి వాటితో పాటు ఈ పీనట్ బటర్​తో గార్నిష్ చేసుకొని తినండి. పండ్ల ముక్కల పైనా పీనట్‌ బటర్‌ రాసుకొని తీసుకోవచ్చు. ఎలా తిన్నా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది!

ప్రయోజనాలు :

  • బరువు తగ్గాలనుకునే వారు కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉండే పదార్థాల్ని మాత్రమే ఆహారంలో చేర్చుకుంటుంటారు. అలాంటి టైమ్​లో ఈ రెండూ కాస్త ఎక్కువగానే ఉండే పీనట్​ బటర్​ మితంగా తీసుకోవడం బరువు తగ్గడానికి చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు నిపుణులు.
  • ముఖ్యంగా దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే ప్రొటీన్లు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేసి.. చిరుతిండ్ల పైకి మనసు మళ్లకుండా ఉంచుతుంది. అలాగే తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ విలువ కలిగిన పీనట్ బటర్ జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవన్నీ అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా బాగా సహాయకరిస్తాయంటున్నారు.
  • అదేవిధంగా దీనిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు మేలు చేస్తాయట. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఇందులోని పోషకాలు తోడ్పడతాయంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

బరువు తగ్గేందుకు ఈ చపాతీలు సూపర్ ఆప్షన్! - షుగర్​ కూడా తగ్గుతుందట!

"బీరకాయ సూప్​"తో బరువు, షుగర్​ తగ్గుతాయట! - ఇలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోండి!

ABOUT THE AUTHOR

...view details