తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

లంచ్ బాక్స్ స్పెషల్ : హెల్దీ అండే టేస్టీ "పాలక్ పులావ్" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

పాలకూరతో అద్దిరిపోయే రైస్ రెసిపీ - పిల్లలైతే ఒక్క మెతుకు వదలకుండా తింటారంతే!

HOW TO MAKE PALAK PULAO
Palak Pulao Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Palak Pulao Recipe in Telugu :ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో ఒకటి పాలకూర. అయితే, చాలా మంది దీన్ని నేరుగా తినాలంటే అంతగా ఇష్టపడరు. ఇక పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీ పిల్లలూ పాలకూర అంటే మొహం చిట్లిస్తున్నారా? అలాంటి వారికోసమే ఒక సూపర్ రైస్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "పాలక్ పులావ్". రుచి అద్భుతంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పైగా దీన్ని చాలా తక్కువ సమయంలో లంచ్​ బాక్స్​లోకి ప్రిపేర్ చేసి ఇవ్వొచ్చు! మరి, ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - ఒకటిన్నర కప్పులు
  • పాలకూర - రెండు కట్టలు
  • పచ్చిమిర్చి - కారానికి తగినన్ని
  • ఆయిల్ - తగినంత
  • లవంగాలు - 7
  • యాలకులు - 3
  • దాల్చినచెక్క - అంగుళం ముక్క
  • మరాటి మొగ్గ - 1
  • బే ఆకులు - 2
  • సోంపూ - అరటీస్పూన్
  • జీడిపప్పు పలుకులు - కొన్ని
  • ఉల్లిపాయ తరుగు - అరకప్పు
  • టమాటా - 1
  • పుదీనా ఆకులు - కొన్ని
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • క్యారెట్ ముక్కలు - ఒక చిన్న కప్పు
  • బీన్స్ ముక్కలు - ఒక చిన్న కప్పు
  • పసుపు - అరటీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నెయ్యి - అరటీస్పూన్

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, బీన్స్ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని పాలకూర వేసి అది మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఆపై రెండు నుంచి మూడు నిమిషాల పాటు పాలకూరను మెత్తగా ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక ఒక గిన్నెలో నార్మల్ వాటర్ తీసుకొని అందులో ఉడికించుకున్న పాలకూరను స్టెయినర్​ సహాయంతో వడకట్టి వేసుకొని చల్లార్చుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో వాటర్ లేకుండా చల్లార్చుకున్న పాలకూర, పచ్చిమిర్చి వేసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, మరాటి మొగ్గ, బే ఆకులు, సోంపూ, జీడిపప్పు పలుకులు వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఉల్లిపాయ తరుగు వేసుకొని కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆపై టమాటా ముక్కలు యాడ్ చేసుకొని అవి కొద్దిగా సాప్ట్​గా మారేంత వరకు ఉడికించుకోవాలి.
  • అనంతరం అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
  • అలా వేయించుకున్నాక అందులో పుదీనా, కొత్తిమీరతరుగు వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత క్యారెట్, బీన్స్ ముక్కలు యాడ్ చేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు మిశ్రమంలో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఉడికాయనుకున్నాక.. ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్​, పసుపు వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై స్టౌను లో ఫ్లేమ్​లో ఉంచి మరో ఐదు నిమిషాల పాటు మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
  • 5 నిమిషాల తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్​లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత బియ్యం ఉడకడానికి సరిపడా వాటర్​, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మరోసారి చక్కగా కలుపుకోవాలి. ఆపై కుక్కర్ మూతపెట్టుకొని ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • అనంతరం కుక్కర్​లోని ఆవిరి పోయాక మూత తీసి నెయ్యి వేసుకొని ఒకసారి ఆ మిశ్రమాన్ని పొడిపొడిగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "పాలక్ పులావ్" రెడీ!

ABOUT THE AUTHOR

...view details