తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఊతప్పం మరింత టేస్టీగా - ఈ పొడితో ప్రిపేర్ చేస్తే కేక! - PODI UTHAPPAM RECIPE

- ఈ టిప్​తో మరింత రుచిగా ఊతప్పం - తిని తీరాల్సిందే!

Onion Podi Uthappam Recipe
Onion Podi Uthappam Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2024, 1:28 PM IST

Onion Podi Uthappam Recipe :చాలా మందికి ఇష్టమైన టిఫెన్లలో ఊతప్పం కూడా ఒకటి. వేడివేడిగా క్రిస్పీగా ఉండే ఊతప్పం.. పల్లీ చట్నీ, అల్లం చట్నీతో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. అయితే.. ఊతప్పంపైమామూలుగా ఆనియన్స్​, పచ్చిమిర్చి వేసి చేస్తుంటారు. వీటితో పాటుగా కాస్త పప్పుల పొడి కూడా వేస్తే రుచి ఇంకా బాగుంటుంది. మరి టేస్టీగా పప్పుల పొడితో ఊతప్పం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

ఊతప్పం పిండి కోసం..

  • మినపప్పు-కప్పు
  • బియ్యం- రెండున్నర కప్పులు
  • మెంతులు- టీస్పూన్​
  • అరకప్పు-పోహా అటుకులు
  • ఉప్పు-రుచికి సరిపడా
  • వంటసోడా- రెండు చిటికెలు
  • ఉల్లిపాయ ముక్కలు
  • పచ్చిమిర్చి ముక్కలు
  • క్యారెట్​ తురుము
  • కొత్తిమీర తురుము

పప్పుల పొడి కోసం..

  • శనగపప్పు- పావుకప్పు
  • మినపప్పు- 2 టేబుల్​స్పూన్లు
  • మిరియాలు -టీస్పూన్​
  • కరివేపాకు-2
  • వెల్లుల్లి రెబ్బలు -10
  • ఎండుమిర్చి-15
  • నల్ల నువ్వులు-టీస్పూన్​
  • ఇంగువ - రెండు చిటికెలు
  • ఉప్పు-రుచికి సరిపడా

తయారీ విధానం..

  • ముందుగా ఊతప్పం పిండి కోసం.. నాలుగు గంటలపాటు బియ్యం, మినపప్పు నానబెట్టుకోవాలి. అలాగే అరగంట సేపు మెంతులు నానబెట్టుకోవాలి. అటుకుల్ని నీళ్లలో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు వీటిని మిక్సీలో వేయాలి. తగినన్ని నీళ్లు పోసుకుంటూ.. మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. పిండిని 12 గంటలపాటు పులియబెట్టాలి.
  • తర్వాత పప్పుల పొడి కోసం.. స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, వెల్లుల్లిరెబ్బలు, కరివేపాకు వేయండి.
  • కరివేపాకు దోరగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్​లో గరిటెతో కలుపుతూ వేయించండి. తర్వాత ఎండుమిర్చి, నల్ల నువ్వులు, ఇంగువ వేసి ఫ్రై చేయండి.
  • ఎండుమిర్చి దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి.
  • ఇందులో రుచికి సరిపడా ఉప్పు కలిపి.. తర్వాత మిక్సీలో వేసుకుని బరకగా గ్రైండ్​ చేసుకోండి.
  • మరుసటి రోజు మీరు ఊతప్పం చేయడానికి కావాల్సినంత పిండిని మరొక గిన్నెలోకి తీసుకోండి. (మిగిలిన పిండిని ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేసుకోండి.)
  • ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, చిన్న గిన్నెలో వంటసోడా కరిగించి వేసుకోండి.
  • పిండిలో సరిపడా నీళ్లు పోసి గరిటెతో బాగా కలపండి. (పిండి కాస్త పల్చగా ఉండాలి.)
  • ఇప్పుడు స్టౌపై దోశల పెనం పెట్టి కాస్త ఆయిల్ వేయండి. పెనంపై గరిటె పిండి వేసి అలా వదిలేయండి. పైన కొన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్​ తురుము, టేబుల్​స్పూన్​ పప్పుల పొడి వేయండి. ఊతప్పం అంచుల వెంట నూనె వేయండి.
  • పెనంపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో ఊతప్పం 5 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత ఊతప్పం మరో వైపు తిప్పి పైన కొద్దిగా ఆయిల్​ వేయండి.
  • రెండు వైపులా ఊతప్పం క్రిస్పీగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి.
  • మిగిలిన పిండితో ఇలానే ఊతప్పం చేసుకుంటే సరిపోతుంది.
  • ఊతప్పం ఈ విధంగా పప్పుల పొడితో చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి.

పప్పు రుబ్బకుండా 5 నిమిషాల్లో నోరూరించే 'బ్రెడ్ ఊతప్పం' చేసుకోండిలా! - దోశను మించిన టేస్ట్!!

హోటల్ స్టైల్ "దహీ వడ" - ఇంట్లోనే సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అద్దిరిపోతుంది!

ABOUT THE AUTHOR

...view details