ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

జాతీయ రహదారుల పనులు - భూసేకరణ వివరాలు అడిగిన కేంద్రం - LAND ACQUISITION PROBLEM

జాతీయ రహదారుల పనుల పురోగతిపై నేడు సమీక్ష నిర్వహించనున్న తెలంగాణ అధికారులు - ప్రధాన అంశంగా భూ సేకరణ

NATIONAL HIGHWAYS IN TELANGANA
LAND ACQUISITION FOR NATIONAL HIGHWAYS IN TELANGANA (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2024, 1:13 PM IST

National Highways in Telangana: జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో పలు చోట్ల భూసేకరణ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సైతం క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోంది.

ప్రధాన అంశంగా భూసేకరణ: భూసేకరణ లో ఉన్న సమస్యలపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. భూసేకరణ సమస్యల పరిష్కారం పురోగతిపై వివరాలు అడిగింది. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాలని రోడ్లు, భవనాల శాఖ నిర్ణయించింది. సచివాలయంలో మంగళవారం ఎన్‌హెచ్‌ఏఐ, రహదారుల ప్రాధికార సంస్థ) కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ(మోర్త్‌) అధికారులతో సమీక్ష నిర్వహించనుంది. సమీక్షలో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణ సైతం ప్రధాన అంశంగా మారనుంది.

తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ

నష్టపోకుండా తగిన పరిహారం:ఇటీవలే ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులోనూ భూసేకరణే ప్రధాన సమస్యగా అధికారులు విన్నవించారు. విజయవాడ-నాగ్‌పుర్‌(ఎన్‌హెచ్‌-163జీ)కి సంబంధించి 8 ప్యాకేజీల్లో పరిహారం మంజూరైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల భూసేకరణ సమస్య వల్ల పనులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. హైదరాబాద్‌-డిండి(ఎన్‌హెచ్‌ 765) రెండు వరుసల మార్గాన్ని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. దీని భూసేకరణపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌-మన్నెగూడ జాతీయ రహదారి పనులను ఇటీవల ప్రారంభించారు. ఇక్కడి భూములకు పరిహారం మంజూరైనా అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌లోని ఉత్తర భాగానికి 1,895 హెక్టార్ల భూమి అవసరం. భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది. అక్కడక్కడా రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా వారు నష్టపోకుండా మెరుగైన పరిహారం ఇస్తామని, ఈ ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది- అమరావతి రైల్వే లైన్‌ కదలింది! - Gazette for Amaravati Railway Line

NTR centenary celebrations: "ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమానికి టీడీపీ సన్నద్ధం

ABOUT THE AUTHOR

...view details