ETV Bharat / offbeat

ఇడ్లీ, దోశ పిండి పులియట్లేదా - ఇలా చేయండి చాలు అంతే - HOW TO FERMENT IDLI DOSA BATTER

ఈ చిట్కాలు అనుసరించారంటే - ఇడ్లీ/దోశ పిండి చక్కగా పులుస్తుందట!

idli_dosa_batter
idli_dosa_batter (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2024, 10:20 PM IST

Dosa And Idli Batter Fermenting Tips in Winter: చాలా మంది ఎక్కువగా ఇష్టపడి తినే టిఫిన్ వెరైటీలలో దోశ, ఇడ్లీ ముందు వరుసలో ఉంటాయి. అయితే, వీటిని తయారు చేసుకోవాలంటే పిండి బాగా పులవడం చాలా అవసరం. పిండి ఎంత బాగా పులిస్తే వంటలో రుచి అంత మంచిగా వస్తాయి. అదే పిండి సరిగా పులియలేదంటే దోశ, ఇడ్లీలు గట్టిగా వస్తుంటాయి. ముఖ్యంగా చలికాలంలో పిండి ఎక్కువగా పులవదు. అయితే, కొన్ని చిట్కాలు ఫాలో అయితే వింటర్​​లో కూడా ఇడ్లీ, దోశ పిండి చక్కగా పులుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి, ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా.

సరైన మోతాదులో తీసుకోవాలి: ముందుగా ఇడ్లీ, దోశ కరెక్ట్​గా రావాలంటే పిండిని సరిగా రెడీ చేసుకోవడం చాలా అవసరం. అంటే పిండి తయారీ కోసం నానబెట్టుకునే ఇడ్లీ రవ్వ, మినప్పప్పు, దోశకి బియ్యం వంటివి ఎంత మోతాదులో తీసుకోవాలో తెలిసుండాలి. అలాకాకుండా ఎక్కువైనా, తక్కువైనా పిండి సరిగా పులియదు. అలా పులియక పోతే దోశ, ఇడ్లీలు చక్కగా రావు. కాబట్టి కావాల్సిన పదార్ధాలు సరైన మోతాదులో తీసుకోవాలి.

మెంతులు, మరమరాలు: చలికాలం దోశ, ఇడ్లీ పిండి సరిగా పులియాలంటే అవి నానబెట్టేటప్పుడు ఒక టీస్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకోండి. అలాగే కొన్ని మరమరాలూ కలపాలి. ఫలితంగా పిండి బాగా పులియడమే కాకుండా ఇడ్లీలు, దోశలు చక్కగా వస్తాయి.

ఇలా మిక్సీ పట్టుకోండి: చాలా మంది పిండి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ కలుపుతుంటారు. అయితే, వింటర్​లో పిండిని మిక్సీ పట్టుకునేటప్పుడు గోరువెచ్చగా ఉండే నీటిని కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి త్వరగా పులుస్తుందట.

పిండిని ఎక్కడ ఉంచాలంటే: పిండి త్వరగా పులియాలంటే వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉంచాలి. అంటే స్టౌ దగ్గర ఉంచడం మంచి పనిగా చెప్పుకోవచ్చు. అలాగే పిండి పులియాలంటే ఎక్కువ సమయం వదిలేయాలి. అదేవిధంగా పిండిని ఉంచే బౌల్స్​లో ఎలాంటి ఖాళీ లేకుండా కరెక్ట్​గా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కూడా పిండి బాగా పులుస్తుందని నిపుణులు అంటున్నారు.

ఒక గిన్నెలో మరిగిన నీరు తీసుకొని అందులో మిక్సీ పట్టిని పిండి ఉన్న గిన్నెను ఉంచి దాన్ని రాత్రంతా ఓ ప్రదేశంలో ఉంచాలి. దీని వల్ల పిండి బాగా పులుస్తుంది. అలాగే కాసేపు పిండిని మైక్రోవేవ్‌లో ఉంచినా బాగా పులుస్తుంది. ఈ టెక్నిక్ మరీ చల్లగా ఉన్నప్పుడు పిండి త్వరగా పులియడానికి బాగా ఉపయోగపడుతుంది.

హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ కోసం చూస్తున్నారా ? - ఇంట్లోనే "ఓట్స్ ఆమ్లెట్"​ చేసేసుకోండి - టేస్ట్​ సూపర్​!

టిఫెన్స్​లోకి పల్లీ చట్నీ తిని బోర్​ కొట్టిందా? - ఓసారి ఈ కర్రీ ట్రై చేయండి - కాంబినేషన్​తో పాటు టేస్ట్​ సూపర్​​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.