DISABLED PERSON RARE FEAT:ఆకాశాన్నంటే హిమగిరులు, పాతాళాన్ని తలపించే లోయలు, దారి ఏదో, ఎడారి ఏదో తెలీనంతగా ఇసుక దిబ్బలు.అనుకోకుండా ఎదురయ్యే నీటి గుంతలు, జారిపడే కొండ చరియలు. సైనికులు తప్ప సామాన్యుల జనసంచారం లేని ఆ కనుమ దారుల్లో బైక్ రైడింగ్ అంటే ప్రొఫషనల్ రైడర్స్ కే చాలా కఠినంగా ఉంటుందని చెప్పవచ్చు అదే ప్రమాదంలో తన కాలును కోల్పోయి,కృతిమంగా అమర్చుకున్న కాలితో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ సాహసికుడి ప్రయాణాన్ని తెలుసుకుందామా?
వైకల్యాన్ని విజయంగా మార్చుకున్నాడిలా: ఈ యువకుడి పేరు నవీన్ కుమార్. సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మిట్టమీదపల్లి ఇతని స్వస్థలం. చదువు విషయానికి వస్తే ఎంబీఏ వరకూ చదువుకున్నాడు. ప్రస్తుతం బెంగుళూరులో బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. 2016 వ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనుకోకండా తన ఎడమ కాలును పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో రెండు నెలలు మంచానికే పరిమితమై నరకాన్ని అనుభవించాడు. గాయం నుంచి కోలుకున్న తరువాత తనలోని లోపాన్ని ఎత్తి చూపించుకోకుండా జీవన ప్రయాణంలో ముందుకు సాగాడు. నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాన్ని సాధించడానికి కఠోరంగా కష్టపడటం అలవరుచుకున్నాడు.
ఇండియా బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో నవీన్: గత జులై మాసంలో హీరో హోండా కంపెనీ బైక్ రైడింగ్ పై మ్యాగ్నెటిక్ ఎక్స్పెడిషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 20 మంది రైడర్లు పాల్గొంటే అందులో నవీన్ కుమార్ ఒక్కడే దివ్యాంగుడు కావడం గమనార్హం. సుమారు ఆరు రోజుల సమయంలో నవీన్ 2361 కిలోమీటర్లు ప్రయాణించాడు.ప్రపంచంలో అత్యంత ఎతైన మార్గాల్లో ఒకటైన ఇండియా చైనా సరిహదుల్లోని ఉమ్లింగ్లా ప్రాంతానికి చేరుకొన్నాడు. అందుకుగానూ అక్కడికి చేరుకున్న తొలి దివ్యాంగుడిగా ఇండియా బుక్స్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ఉమ్లింగ్లా ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయులు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి సమయంలో ఊపిరి ఆడటం సైతం కష్టంగా ఉండే పరిస్థితులు లేకపోలేదు. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉన్నాయి. అయినా సరే సాహసం చేశాను, నేను ఇబ్బందిపడిన సందర్భాల్లో హీరో ఎక్స్ క్లీనర్స్ తనకు సాయపడ్డారని నవీన్ కుమార్ ఇలా చెప్పుకొచ్చాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమాారి వరకు వెళ్లడం తన తరువాత లక్ష్యంగా వివరించాడు. జాతీయ స్థాయుల్లో బ్యాడ్మింటన్ కూడా ఆడిన నవీన్ ప్రస్తుతం 2026 లో జరగబోయే ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీలకు శిక్షణ పొందుతున్నాడు.
"నువ్వేం ఆడతావ్" అన్నవాళ్లే ఇప్పుడు శభాష్ అంటున్నారు - భవానీ నీకు సెల్యూట్!
జంషెడ్జీ నుంచి మాయ వరకు - టాటా ఫ్యామిలీ చేసిన వ్యాపారాలివే! - TATAs Business Journey