తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఘుమఘుమలాడే "మటన్ వేపుడు" - ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి - ముక్క మిగలకుండా తినేస్తారు!

లొట్టలేసుకుంటూ తినే సూపర్ రెసిపీ - ఇలా చేశారంటే టేస్ట్ వేరే లెవల్ అంతే!

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

How to Make Mutton Roast
Mutton Roast Recipe (ETV Bharat)

How to Make Mutton Roast Recipe : చాలా మంది సాధారణంగా మటన్​ గ్రేవీ కర్రీ వండేస్తుంటాం. లేదంటే.. బిర్యానీ ట్రై చేస్తుంటారు. అయితే.. ఈసారి మటన్​ వేపుడు ట్రై చేయండి. ఎంతో రుచికరంగా ఉంటుంది! ముక్క మెత్తగా ఉడికే ఈ రెసిపీని చిన్న పిల్లలూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతకీ.. ఈ టేస్టీ మటన్రోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

మటన్ ఉడికించుకోవడం కోసం :

  • మటన్ - అరకేజీ
  • పసుపు - అర టీస్పూన్
  • కారం - 1 టీస్పూన్
  • ఉప్పు - 1 టీస్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • పచ్చిమిర్చి - 2
  • లవంగాలు - 3
  • దాల్చిన చెక్క - అంగుళం ముక్క
  • కరివేపాకు - 1 రెమ్మ

వేపుడు కోసం :

  • నూనె - 5 టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయ - 2(మీడియం సైజ్​వి)
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • కారం - తగినంత
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • జీలకర్ర పొడి - అర టీస్పూన్
  • గరం మసాలా - అర టీస్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

ఈ కొలతలతో చేస్తే 'హోటల్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ' పక్కా! ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు!!

తయారీ విధానం :

  • ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టించి తెచ్చుకున్న మటన్​ను శుభ్రంగా కడగాలి. తర్వాత మటన్​ని కుక్కర్​లోకి తీసుకొని పసుపు, 1 టీస్పూన్ చొప్పున కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి.
  • ఆపై మూత పెట్టి స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ ముదురుదైతే అదనంగా మరో రెండు విజిల్స్ ఉడికించుకోవాలి. అంటే.. మటన్ మెత్తగా ఉడకాలి.
  • ఆ విధంగా ఉడికించుకున్నాక కుక్కర్​లోని ప్రెజర్ మొత్తం ఎయిర్ పోయాక.. మూతతీసి ఒకసారి ఆ మిశ్రమాన్ని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై.. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్​లో ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక.. కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
  • అలా వేయించుకున్నాక.. అందులో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని వాటర్​తో సహా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌను హై ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో కలుపుకుంటూ వాటర్ పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇందుకోసం.. 5 నుంచి 6 నిమిషాల సమయం పట్టొచ్చు.
  • మటన్ మిశ్రమంలో వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్సెపరేట్ అవుతున్నప్పుడు.. స్టౌను మీడియం ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకొని మధ్యమధ్యలో కలుపుతూ మరో ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి.
  • ఆ విధంగా వేయించుకున్నప్పుడు మటన్ ముక్కలు మంచిగా వేగి కలర్ ఛేంజ్ అవుతాయి. అప్పుడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌను లో ఫ్లేమ్​లో ఉంచి 1 నుంచి 2 నిమిషాలు వేయించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఇక చివరగా కొత్తిమీర తరుగు చల్లుకొని ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "మటన్ వేపుడు" రెడీ!

ఘుమఘుమలాడే "తెలంగాణ స్టైల్ తలకాయ కూర" - ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అదుర్స్!

ABOUT THE AUTHOR

...view details