ETV Bharat / sports

అలా చేయాల్సింది కాదు, అది నా తప్పే : మీడియాతో రోహిత్

Rohit Sharma On 46 All Out : కివీస్​తో తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 46 పరుగులకే ఆలౌటైంది. దీంతో రోహిత్ శర్మ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇన్నింగ్స్​పై స్పందించాడు.

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

IND VS NZ 1ST TEST
IND VS NZ 1ST TEST (Source: Associated Press)

Rohit Sharma On 46 All Out : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ దారుణంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 46 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియా ముందుకొచ్చాడు. సాధారణంగా కెప్టెన్‌లు టెస్టుల్లో మ్యాచ్‌ ప్రారంభం లేదా పూర్తయ్యాక మీడియాతో మాట్లాడుతారు. కానీ, స్వదేశంలో అత్యల్ప స్కోరుకు ఆలౌటైన తర్వాత ఘోరమైన ప్రదర్శనను వివరించే బాధ్యత తీసుకున్నాడు. మీడియా నుంచి ఎదురైన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

'ఈరోజు మాది కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి మ్యాచ్‌లు ఆడాము. కెప్టెన్‌గా స్కోర్ బోర్డుపై 46 పరుగులు చూసి బాధపడ్డాను. మొదట బ్యాటింగ్ ఎంచుకోవడమే నా తప్పు. నేను ఫ్లాట్ పిచ్‌ని ఆశించాను. కానీ, పిచ్‌ని నేను సరిగ్గా అంచనా వేయలేకపోయాను. ఇది ఒక సవాలు. అప్పుడప్పుడు ఇలాంటి సవాళ్లు స్వీకరించడం అవసరం. కేఎల్‌ రాహుల్, సర్ఫరాజ్‌ ఖాన్ బ్యాటింగ్‌ పొజిషన్లు మార్చాలనుకోలేదు. అందుకే విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే బాధ్యత తీసుకున్నాడు. ఒక సీనియర్ ఆటగాడు అలా చేయడం చాలా గ్రేట్‌' అని అన్నాడు.

పంత్‌కి గాయం
రిషబ్ పంత్ కీపింగ్ చేస్తుండగా ఎడమ మోకాలికి బంతి తగిలింది. 2022లో కారు ప్రమాదం తర్వాత అదే మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. బంతి తగిలిన చోట వాపు రావడం వల్ల పంత్‌ మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌ కీపింగ్‌ చేశాడు. దీనిపై రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. 'గాయం పెద్దది కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా పంత్​ను కొనసాగించలేదు. పంత్ రాత్రికి కోలుకుంటాడు. మూడో రోజు మ్యాచ్‌ ఆడుతాడని భావిస్తున్నాం' అని చెప్పాడు.

పటిష్ఠ స్థితిలో న్యూజిలాండ్‌
రెండో రోజు ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం కివీస్ స్కోర్ 180-3 (50 ఓవర్లు). క్రీజులో రచిన్ రవీంద్ర (22), డారిల్ మిచెల్ (14) ఉన్నారు. డెవాన్ కాన్వే అత్యధికంగా 91 పరుగులు చేశాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 46 పరుగులకే ఆలౌటైంది.

నలుగురు భారత బ్యాటర్లు డకౌట్​, 34 రన్స్​కే 6 వికెట్లు డౌన్​ - 1969 తర్వాత ఇదే తొలిసారి

'సిరాజ్ ఇప్పుడు DSP - అతడికి టీమ్​మేట్స్​ సెల్యూట్ కొట్టారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.